Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాలలో ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం

పరకాలలో ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా ముగిసింది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులు, నీట్ పేపర్ లీకేజీ అంశాలపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ఎస్వీ జూనియర్ కళాశాలను పూర్తిగా బంద్ చేయించారు.

ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్ మాట్లాడుతూ, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులపై ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనలతో మనస్తాపం చెంది ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని కోరారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, దేశంలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న ఎన్టీఏను తక్షణమే రద్దు చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, వీబీఎస్ఏ బిల్లును వెనక్కి తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షుడు దొమ్మటి విశ్వంత్, ప్రధాన కార్యదర్శి బన్నీ, నాయకులు రేవంత్, మహేష్, వినయ్, అజయ్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -