- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు, బ్రెజ్జా కారు ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి చేవెళ్లకు వెళ్తున్న మెహదీపట్నం డిపో బస్సు యూటర్న్ వద్ద కారును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు వెంటనే ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మరోవైపు బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సేఫ్‌గా బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
- Advertisement -



