- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు : ఎమ్మెల్సీ,టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.మహేష్ కుమార్ గౌడ్ ఆయురారోగ్యాలతో,సుఖ శాoతులతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాటారం మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపిపి సమ్మయ్య,యూత్ నాయకుడు రాహుల్,రైతు కిషాన్ అధ్యక్షుడు వొన్న వంశివర్ధన్ రావు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



