కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల డిమాండ్
కార్మిక శాఖ కమిషనర్‌కు వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనాలు సవరించి పెంచాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ జేసీఎల్ శ్యాంసుందర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంజాద్. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎఎల్. పద్మ ఐ.ఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, బీఆర్‌టీయూ రాష్ట్ర నాయకులు దానకర్ణాచారి, ఏఐయూటీయూసీ రాష్ట్ర ఇన్ భరత్, సీఐటీయూ ఉపాధ్యక్షులు జె. మల్లిఖార్మన్, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు కూరపాటి రమేష్, పాలడుగు సుధాకర్, ఐఎఫ్‌టీయూ నాయకులు అనూరాధ, అరుణక్క, ఏఐటీయూసీ నాయకులు వెంకటేష్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న తదితరులు పాల్గొన్నారు. 2021లో కనీస వేతనాల సలహా మండలి సిఫార్సులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ప్రకటించిన 78 షెడ్యూల్ ఎంప్లాయీమెంటులో కనీస వేతనాలను పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించి జీవోలు విడుదల చెయ్యాలని కోరారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఎంప్లాయీమెంటులో కనీస వేతనాల పెంపుదల చాలాకాలంగా పెండింగలో ఉన్నదని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 21న రాష్ట్రంలో కనీస వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. కనీస వేతనాలను రాష్ట్రంలో మూడు జోన్లుగా విభజించారని తెలిపారు. దీనివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. వేతనాలను నాలుగు కేటగిరీలుగా విభజించి అన్ని రంగాల్లో ఒకే రీతిలో వేతనాలు పెంచడం వల్ల గతంలో వివిధ ఎంప్లాయీమెంట్‌లో వివిధ రకాల పనులకు వేరు వేరుగా వేతనాలు చెల్లించే పద్ధతి లేకుండా పోతోందని తెలిపారు. కనీస వేతనాల పెంపుదల సందర్భంగా కరువుభత్యం గురించి ప్రస్తావన చేయలేదని గుర్తు చేశారు. పెరిగిన వేతనాలు కూడా నాలుగు కేటగిరీల్లో అన్‌స్కిల్డ్ వర్కర్‌కు రూ.14వేలు, సెమీస్కిల్డ్ వర్కర్ కు రూ.15వేలు, స్కిల్డ్ వర్కర్ కు రూ.16,500లు, హైస్కిల్డ్ వర్కర్ కు రూ.18వేలు పెంచినట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇందులో అన్ స్కిల్డ్ వర్కర్ కు తప్ప మిగతావారికి బేసిక్ కరువుభత్యం కలుపుకుని ఇప్పటికే వస్తున్న జీతానికి పెరిగిన జీతానికి పెద్ద తేడా ఏమీలేదని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు ఇంకా తగ్గే పరిస్థితి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ లేబర్ జీవో నెం11 ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో రూ.13,098ల నుండి రూ.23,683 వరకు వేతనం పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నెం4తో పోలిస్తే కూడా కొన్ని కేటగిరీలో స్వల్పంగా పెరుగుదల, కొన్ని కేటగిరీలో ప్రస్తుతం పొందుతున్న వేతనం కంటే తగ్గుతుందని తెలిపారు. జీవో నెం4లో స్కిల్డ్ వర్కర్ కు రూ.19,572లు వేతనంగా ఉండగా ప్రభుత్వం ప్రకటించిన వేతనం రూ.18,500లు మాత్రమే ఉందనీ, గతంతో పోలిస్తే రూ.1,072లు తగ్గిందని తెలిపారు. సఫాయి కార్మికులకు ఇదే రకమైన అన్యాయం జరిగిందని కమిషనర్‌కు వివరించారు.గతంలో కనీస వేతనాల సలహా మండలి బోర్డు అన్ స్కిల్డ్ కార్మికుడికి కనీస వేతనం రూ.18,019లు, హైస్కిల్డ్ రూ.39,830లు. కరువుభత్వం ఒక్కొక్క పాయింట్ కి రూ.12లు సిఫార్సులు చేసిందని గుర్తు చేశారు. దీంతో 2021 జూన్ నెలలో అప్పటి ప్రభుత్వం 5 జీవోలను జారీ చేసిందని తెలిపారు. ఈ జీఓలను గెజిట్ చేసి అమలు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. వాటిని నాటి నుండి నేటి వరకు గెజిట్ విడుదల చేయలేదని తెలిపారు. పెరిగిన ధరలు, 1948 కనీస వేతనాల చట్టం, డాక్టర్ అక్ట్రాయిడ్ నిర్వహించిన విధానం, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా శాస్త్రీయంగా వేతనాలను లెక్కిస్తే రూ.32వేలు పెంచాలనీ, కార్మికులు కార్మిక సంఘాలు కనీసం రూ.26,వేలు వేతనం ఉండాలని కోరుతున్నాయని తెలిపారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు 60 శాతం వేతనాలను పెంచిందని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో 30 శాతం మాత్రమే పెంచిందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం పెంచిన వేతనాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను సవరించాలని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



