Friday, May 29, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభం

ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభం

- Advertisement -

– జిల్లాకు చేరిన 445170 పుస్తకాలు
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
: ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, హిందీ మీడియం లకు సంబంధించిన ఉచిత పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. జిల్లాకు కావలసిన 480700 పాఠ్యపుస్తకాలలో 445170 పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నట్టు ఆదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్  తెలిపారు. పాఠశాలల పునః ప్రారంభ తేదీ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి పాఠ్యపుస్తకాల సరఫరా ప్రారంభించినట్టు  తెలిపారు. పాఠశాలలు పునప్రారంభం లోగా ప్రతి పాఠశాలలోని ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పాఠ్య పుస్తకాలకు సీరియల్ నెంబర్ ఉంటుందని ఆ సీరియల్ నెంబర్ రాసుకొని విద్యార్థులకు సరఫరా చేయాలని ఆదేశించారు. పాఠ్య పుస్తకాలను నిలువ చేసేందుకు పాఠశాలల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ గౌడ్, సాంఘిక సంక్షేమ పాఠశాలల సమన్వయకర్త ప్రిన్సిపల్ లలిత కుమారి, పాఠ్య పుస్తకాల  మేనేజర్ నూటెంకి సత్యనారాయణ, సీసీ రాజేశ్వర్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -