- Advertisement -
నవతెలంగాణ – జన్నారం: జన్నారం మండల కేంద్రంలోని ఎఫ్సీఐ గోదాంలో, హమాలీ కార్మికులు సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంబటి లక్ష్మణ్ సిఐటియు మండల కార్యదర్శి సీఐటియూ జెండాను ఆవిష్కరించినారు. వారు మాట్లాతూ కార్మికుల పరిరక్షణకు, శ్రామిక వర్గాల ఐక్యతకు చేస్తున్న పోరాటాలను గుర్తు చేసుకుంటూ సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటియూ సీనియర్ నాయకులు కూకటికారు బుచ్చయ్య ఎఫ్సిఐ అమాలి కార్మికులు పాల్గొన్నారు.
- Advertisement -



