Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్  విద్యార్థులు ఇష్టపడి చదవాలి: రిటైర్డ్ ఐఏఎస్

  విద్యార్థులు ఇష్టపడి చదవాలి: రిటైర్డ్ ఐఏఎస్

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ :విద్యార్థులు ఇష్టపడి చదవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తొగర్ల చిరంజీవి అన్నారు. పట్టణంలోని పదవ తరగతి విద్యార్థులకు జిల్లా దేవాంగ విద్యా కమిటీ ఆధ్వర్యంలో  23వ ప్రతిభ పురస్కార కార్యక్రమం ఆదివారం పట్టణంలోని సి కన్వెన్షన్ హాలు యందు నిర్వహించినారు.‌ వీరితోపాటు అఖిలభారత దేవాంగ సంఘ ఉపాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్  రాజేశ్వర్  ఆర్ ఇ ఆర్ ఎ  డైరెక్టర్ ఐఏఎస్  కొంగి గంగాధర్ తదితరులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో చదవాలని మంచి గోల్తో ముందుకెళ్లాలని అంతేకాకుండా పదవ తరగతి తర్వాత ఉండేటటువంటి వివిధ రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సమయం వృధా చేయవద్దని మంచి క్రమశిక్షణతో ఉండాలని సమయపాలన పాటించాలని అన్ని కోర్సులలో నైపుణ్యాలను సంపాదించాలని కలలు కంటూ వాటి సహకారం కోసం నిరంతరం శ్రమించాలని తల్లిదండ్రులు విద్యార్థుల బాగోగులు చూడాలని విద్యార్థుల ఆర్థిక పరిస్థితి విద్యకు అడ్డు రాదని కాబట్టి బాగా చదివినట్లయితే అన్ని రకాల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలో ఈ సంవత్సరం సెలెక్ట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా ఎన్నికైన వివిధ రకాల రాజకీయ నాయకులను సన్మానించడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యనే రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులను కూడా సన్మానించడం జరిగింది  జిల్లాలోని వివిధ గ్రామాలలో గల విద్యార్థుల మార్కులను బట్టి గ్రామస్థాయిలో 20 ప్రథమ 20 ద్వితీయ బహుమతులు నగదు బహుమతులు ఇవ్వడం జరిగింది .జిల్లా స్థాయిలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానం సంపాదించిన చౌల విష్ణు తేజ రా పెళ్లి రశ్మిత మరియు గంజి సాత్విక లను జ్ఞాపిక మెడల్ మరియు నగదు బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవ స్ఫూర్తి సొసైటీ ఆనంద్  సమక్షంలో 40 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ ఫైళ్లను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం లో దాదాపుగా 60 వేల నగదు పురస్కారాలు విద్యార్థులకు అందజేయడం జరిగిందని జిల్లా దేవాంగ విద్యా కమిటీ నిజామాబాద్ సభ్యులు గోపాల వినాయక్ ,పసుపుల రఘునాథ్ లో తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏసిటిఓ లిక్కి భూమేశ్వర్, ఇంజనీర్ భూమయ్య ,కొంగ సదాశివ్, చంద్రమోహన్ ,బోణిక రాము, పసుపుల భువనేశ్వర్, కొంగిరాము ,కొంగి మోహన్  ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -