Sunday, September 20, 2026
E-PAPER
Homeహైదరాబాద్ప్రజా సహకారంతో అన్ని రంగాలలో ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం

ప్రజా సహకారంతో అన్ని రంగాలలో ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం

- Advertisement -
  • తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా ప్రజలందరికీ పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వ‌హ‌ణ‌తో ప్రజలలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనుల వివరాలు గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయి సమావేశాలలో ప్రజలకు వివరించడం స్వాగతించదగ్గ విషయమని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని, మహిళల ఉచిత ప్రయాణ నిమిత్తం ప్రభుత్వం 146.24 కోట్ల రూపాయల ఖర్చును భరిస్తుందని, కేవలం 500 రూపాయలకే వంటగ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -