Saturday, June 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిస్వయంకృ తాపరాధం

స్వయంకృ తాపరాధం

- Advertisement -

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాం శమయ్యాయి. అధికార అహంకారంలో ప్రజలకు దూరమైతే, మతతత్వ శక్తులతో అవకాశవాద రాజకీయాలు చేస్తే చివరకు దాని ఫలితం ఎలా ఉంటుందో బెంగాల్ ప్రత్యక్ష‍ ఉదాహరణ. బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కరోజులో జరిగిన పరిణామం కాదు. దానికి ఆ పార్టీ ఎత్తులు ఎంత కారణమో, మమతా బెనర్జీ స్వయం కృతాపరాధాలు కూడా అంతే కారణం? వాస్తవానికి బీజేపీ బెంగాల్‌లో పాదం మోపడానికి రాజకీయంగా అవకాశమిచ్చింది కూడా మమతేనన్న సంగతి మనం మరువకూడదు. ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్‌‌లో అసంతృప్తి చెలరేగింది. ఒకప్పుడు మమతకు అత్యంత సన్నిహితులుగా ఉన్న నాయకులు వేర్వేరు గ్రూపులుగా విడిపోతున్నారు. కొందరు పార్టీని వీడుతున్నారు. మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసు కున్న బీజేపీ తృణమూల్‌‌ను దెబ్బతీసే పనిలో పడింది. ఆ పార్టీ నేతలను తమ ‘వాషింగ్‌ ‌మిషన్‌‌’లో శుద్ధి చేస్తోంది. పార్టీ అంతర్గత కమిటీల రద్దు, నాయ కత్వ సంక్షోభం, శాసనసభలో ప్రతిపక్ష నాయకత్వంపై వివాదాలు తృణమూల్‌‌లో ఏర్పడిన గందరగోళానికి సంకేతాలు.

తాజా పరిణామాలకు ముందుకు మూడు దశాబ్దాలు వెనక్కివెళ్తే తృణ మూల్‌ ‌అవకాశవాద రాజకీయం అర్థమవుతుంది. 1990 చివరలో కాంగ్రెస్‌‌ నుంచి బయటకొచ్చిన మమతా బెనర్జీ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌‌ను స్థాపించింది. వామపక్ష‍ ప్రభుత్వాన్ని గద్దెదించే లక్ష్యంతో బీజేపీతో చేతులు కలిపింది. వాజ్‌‌పేయ్‌ ‌నేతృత్వంలోని ఏన్డీయేలో చేరి రైల్వే మంత్రిగానూ పనిచేసింది. వామపక్ష‍ాలను బలహీనపరచాలని చివరకు మావోయిస్టులతో చేతులు కలిపేందుకు కూడా వెనుకాడలేదు. 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మమత అదే రాజకీయాన్ని కొనసాగించింది. వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు తిరిగి బలపడకుండా అన్ని స్థాయిల్లో అడ్డుకునే ప్రయత్నం చేసింది. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వరకు ప్రతిపక్ష స్థలాన్ని కుదించింది. ఫలితంగా వామపక్షాలు కాస్త బలహీనపడినా, కాంగ్రెస్ పూర్తిగా క్షీణించింది. ఆ ఖాళీని బీజేపీ ఆక్రమించింది. 2021 ఎన్నికల తర్వాత స్వయంగా మమత “వామపక్షాలు ప్రతి పక్ష‍ంలో ఉంటే బాగుండేది, ప్రజా సమస్యలు చర్చకైనా వచ్చేవి’’ అంటూ వ్యాఖ్యానిం చడం యాదృచ్ఛికం కాదు.

వామపక్షాలను పూర్తిగా రాజకీయంగా తుడిచి పెట్టాలనుకుని అసలుకే ఎసరు తెచ్చుకుంది. తన రాజకీయానికి వచ్చిన దుష్పరిణామాన్ని ఆమె గుర్తించినా అప్పటికే ఆలస్యమైంది. అంతవరకు బెంగాల్‌‌లో చిన్న శక్తిగానే ఉండేది. ప్రధాన రాజకీయ పోటీ వామపక్ష‍ ఫ్రంట్‌, కాంగ్రెస్‌ ‌మధ్య సాగేది. కానీ తృణమూల్‌- బీజేపీ పొత్తుల వల్ల బీజేపీ గ్రామాలకు పాకింది. ఇతర పార్టీల వ్యతిరేక ఓట్లను సమీకరించే ప్రక్రియలో తన సొంత రాజకీయ స్థావరాన్ని నిర్మించుకుంది. ఆ విత్తనమే నేడు విషవృక్ష‍ంగా మారింది. పదిహేనళ్ల పాటు అధికారంలో ఉన్న మమతా వామపక్ష‍ాలను బలహీన పరచాలనే చూశారు తప్ప ప్రజా సమస్యల్ని పట్టించుకోలేదు. నిరుద్యోగం, పరిశ్రమల కొరత, వ్యవసాయ సంక్షోభం, ధరల పెరుగుదల, కార్మికుల సమస్యలు పరిష్కారం నేటికీ అలాగే ఉన్నాయి. వామపక్ష‍ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు, కార్మికుల బాధలు, కేంద్రం అనుసరిస్తున్న విధానాల ప్రభావం వంటివి విస్తృతంగా చర్చకు వచ్చేవి.

తృణమూల్‌ బలపడినప్పుడు కూడా వామపక్ష‍ాలు ప్రధాన ప్రతిపక్ష‍ంగా నిలిచి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవి. ఇప్పుడు అధికార-ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న రాజకీయ రగడలో ఇవి చర్చకు రావడం లేదు. పైగా తాజాగా బెంగాల్‌ ‌ముఖ్య మంత్రి సువేందు అధికారి ‘మా ప్రభుత్వం హిందువుల కోసం మాత్రమే పని చేస్తుంది, ముస్లింల కోసం కాదు’’ అని ప్రకటించడం వారి నిజస్వరూపాన్ని బహిర్గతం చేసింది. పైగా ముస్లింలు బంగ్లాదేశ్‌‌కు వెళ్లిపోవాల్సిందేనంటూ బీజేపీ నేతలు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. తృణమూల్‌ వామపక్ష‍ాలను బలహీన పరచడం చివరకు బీజేపీకే లాభం చేకూర్చింది.ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన శక్తులను అణచివేసి, రాజకీయ పోటీని రెండు పార్టీల మధ్య పరిమితం చేస్తే, చివరకు మతతత్వ శక్తులు ఎలా బలపడతాయో బెంగాల్‌ ‌ అనుభవం చూపిస్తోంది. ఇదంతా చూస్తుంటే మహాభారతంలోని ధృతరాష్ట్ర కౌగిలి గుర్తుకు వస్తుంది. ప్రేమగా కౌగిలించుకున్నట్టు కనిపించినా అంతిమంగా అది వినాశనానికి దారితీస్తుంది. అన్నట్టుగానే వామపక్షాలను ఓడించేందుకు బీజేపీతో కలిసి నడిచిన రాజకీయాలు చివరకు మమతనే మింగేశాయి. నేడు బీజేపీ అదే సంబంధాలను, అదే నాయకుదే రాజకీయ స్థలాన్ని ఉపయోగించుకుని తృణమూల్‌‌ను నిలువునా కూల్చే ప్రయత్నం చేస్తోంది. ఇది మమతా స్వయంకృతాపరాధమే!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -