తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ కన్వీనర్ :ఎం. జనార్ధన్ రెడ్డి
బర్కత్ పుర ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట పెన్షనర్ల ధర్నా
నవతెలంగాణ-అంబర్‌పేట
అర్హత కలిగిన పెన్షనర్లందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ కన్వీనర్ ఎం. జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంప్లాయిస్ పీఎఫ్ స్కీమ్ ఫెన్షన్‌ను రూ.9000కు పెంచి కరువు భత్యం ఇవ్వాలన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బర్కత్‌పురాలోని ఈపీఎఫ్ కార్యాలయం వద్ద పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల డబ్బులను ప్రయివేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. దోపిడీదారులకు లాభాలు చేకూర్చి, సామాన్య పెన్షనర్లను విస్మరించడం బాధాకరమన్నారు. పెన్షన్ నిధుల ప్రయివేటీకరణను పూర్తిగా ఆపాలని, పెన్షనర్ జీవిత భాగస్వామి అంత్యక్రియలకు రూ.5,000 సహాయం అందించాలని కోరారు. పెన్షనర్లు, వారి జీవిత భాగస్వాములకు రైలు, బస్సు ప్రయాణాల్లో ప్రత్యేక రాయితీలు కల్పించాలని, ఈఎస్ఐ డిస్పెన్సరీలలో వృద్ధులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో ఎం.ఎన్. రెడ్డి, పి. కష్ణమూర్తి, నరహరి, నర్సింగ్ రావు, అరుణ తదితర పెన్షనర్లు పాల్గొన్నారు.
పెన్షనర్లందరికి హయ్యర్ పెన్షన్ అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



