Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం 

ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్
ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. రోజువారీగా పోటాపోటీన అభ్యర్థుల విజయం కోరుతూ, ఆ పార్టీ నాయకులు పట్టణంలో ఇంటింటి చుట్టూ ముట్టి ప్రచారం జోరుగా నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు  అడిగిందే తడవుగా వారి కోరికలు తీర్చేందుకు అభ్యర్థులు ప్రయత్నించారు. ఆలేరులో పేరుకుపోయిన ప్రజా సమస్యలు మీ కారణంగానే అంటే ,మీ కారణంగా అంటూ ఎన్నికల్లో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.

నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే పార్టీలు అభ్యర్థిని రానున్న మున్సిపల్ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో  గెలిపించాలని, సమస్యలు మేమే పరిష్కారం చేస్తామని చెబుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన వారు ప్రజల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించే అభ్యర్థులను గెలిపించుకోవడం వలన ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పాలకవర్గంలో ప్రజా గొంతుకగా పనిచేస్తారని, రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య,

 మాజీ ప్రభుత్వ విప్పు, ఆలేరు మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి  పట్టణంలో ప్రచారం నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్, పట్టణ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు ఎలాగైనా విజయం సాధించాలని పలు సలహాలు సూచనలు చేస్తూ మద్దతు తెలిపారు. మద్దతుగా రాష్ట్ర నాయకులు కల్లూరు రామచంద్రారెడ్డి అభ్యర్థుల విజయం కోరుతూ పట్టణంలోని వార్డులని కలియతిరిగారు.

సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ విజయం కోరుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరు మల్లేశం ఆధ్వర్యంలో పట్టణంలో నాలుగో వార్డుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేసినప్పుడు టిఆర్ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, రైతుబంధు ,రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు అందాయని ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు చెప్పారు.

గత పాలకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోయాయని ,ఆలేరు పట్టణంలో మురుగు కాలువల నిర్మాణం, సీసీ రోడ్డు నిర్మాణం, కమ్యూనిటీ హాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకవర్గం విఫలమైందని, ఐదు సంవత్సరాల కాలంలో కనీసం చెత్త డంపింగ్ యార్డ్ ను సైతం ఏర్పాటు చేసుకోవాలని దీన వ్యవస్థలో మున్సిపల్ వర్గం గడిచిపోయిందని ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాబోయే పాలవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ,ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తారని నిధులు వస్తాయని అంటున్నారు. ఎన్నికలవేళ  అసంతృప్తులను ఆయా పార్టీలలోకి చేర్చుకుంటూ తమపై చేయి చూపించుకునేందుకు  ఆయా పార్టీలు తహతహలాడయి.

 ఎన్నికల సందర్భంగా అభ్యర్థులకు దాహతుకుమించి ఖర్చు వచ్చి పడింది. ఆలేరు పట్టణ ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో ఎటువైపు మొగ్గు చూపుతారో  కానీ, ప్రజలు మాత్రం మీకే మద్దతు అంటూ.. మీకే మద్దతు అంటూ తమ అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు. కలెక్టర్ హనుమంతరావు ఎన్నికల ఏర్పాట్లను పలుమార్లు సందర్శించి పర్యవేక్షించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ముందస్తుగా పట్టణంలోని 12 వార్డులలో  కవాతు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -