Sunday, June 7, 2026
E-PAPER
Homeహెల్త్దాంపత్యంలో అహంకారం ఙర అనుబంధం

దాంపత్యంలో అహంకారం ఙర అనుబంధం

- Advertisement -

భార్యాభర్తల మధ్య క్షమాపణను బలం లేదా బలహీనతగా చూడటం కంటే.. అది బంధాన్ని రిపేర్‌ చేసే సాధనంగా పరిగణించాలి. ఇద్దరూ భాగస్వాములే కాబట్టి, సారీ అనేది ‘నేను తప్పు చేశాను’ అనే దానికంటే, ‘నీ భావాలకు నేను విలువ ఇస్తున్నాను’ అనే సందేశాన్నిస్తుంది.

బలం : బంధాన్ని నిలబెట్టే సారీ. భార్యాభర్తల బంధంలో సారీ అనేది, ఆ బంధం పట్ల ఉన్న నిబద్ధత, సానుభూతికి బలమైన సంకేతం.
కేస్‌ స్టడీ: నిజమైన పశ్చాత్తాపం. రాజేష్‌ (భర్త) చాలా ఒత్తిడిలో ఉన్న కారణంగా, తన భార్య అంజలిపై అనవసరంగా కోపం తెచ్చుకునేవాడు.. అంజలి బాధపడేది. రాజేష్‌ వెంటనే తన పొరపాటును గుర్తించాడు.
రాజేష్‌ చర్య: అతను అంజలి దగ్గరకు వెళ్లి, ”అంజలీ! నేను నీపై అరిచినందుకు సారీ. ఆ కోపం నీపై చూపించాల్సింది కాదు. నా ఆఫీస్‌ ఒత్తిడిని ఇంటికి తెచ్చాను. నువ్వు బాధపడటానికి నేనే కారణం. దయచేసి నన్ను క్షమించు” అని చెప్పాడు. ఆ తర్వాత, మళ్లీ ఇలా జరగకుండా ఉండేందుకు తాను పని ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలనే దానిపై ఆమెతో చర్చించాడు.

సైకలాజికల్‌ ఎనాలిసిస్‌
బాధ్యతను అంగీకరించడం: రాజేష్‌ తన కోపాన్ని ఎదుటి వ్యక్తిపై నెట్టకుండా, దాన్ని తన ఒత్తిడి కారణంగా అంగీకరించాడు. ఇది అతని మానసిక పరిపక్వతను సూచిస్తుంది.
అహంకార త్యాగం: దాంపత్యంలో ‘నేనే గొప్ప’ అనే అహంకారాన్ని వదిలిపెట్టి, భాగస్వామి భావాలకు విలువనివ్వడం బంధానికి బలం. క్షమాపణ విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది.
మార్పుకు హామీ: మళ్లీ తప్పు చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం (ఉదా: ఒత్తిడి నిర్వహణపై చర్చించడం) అనేది క్షమాపణ నిజాయితీని నిరూపిస్తుంది.
కొటేషన్‌ :”విజయవంతమైన వివాహానికి రహస్యం ఎప్పుడూ ఒకటే. క్షమించాల్సినప్పుడు త్వరగా క్షమించండి, ‘సారీ’ చెప్పాల్సినప్పుడు ధైర్యంగా చెప్పండి”. (The secret to a successful marriage is always the same: be quick to forgive and courageous to say sorry)


బలహీనత: భర్త/ భార్య విషయంలో చేసిన తప్పుని పట్టించుకోకపోవడం, మార్పు లేని ఉపరితల క్షమాపణ బంధాన్ని బలహీనపరుస్తుంది.
కేసు స్టడీ: ఉపరితల క్షమాపణ, మార్పు లేకపోవడం.
వరుణ్‌ (భర్త) తరచుగా తన భార్య శతికి ముఖ్యమైన పనులు చేస్తానని చెప్పి మర్చిపోతుంటాడు. శతి కోప్పడినప్పుడల్లా, వరుణ్‌ వెంటనే ‘సారీ’ చెబుతుంటాడు.
వరుణ్‌ చర్య: వరుణ్‌, శతి పుట్టినరోజుకు సరైన ఏర్పాట్లు చేయలేదు. శతి బాధపడింది. వరుణ్‌ వెంటనే, ”నేను చాలా బిజీగా ఉన్నాను కదా! ఏడ్వకు, సారీ.” అని చెప్పి, ఆ గొడవను త్వరగా ముగించడానికి ప్రయత్నించాడు. కానీ భవిష్యత్తులో ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవడానికి లేదా బాధ్యత తీసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు.

సైకలాజికల్‌ ఎనాలిసిస్‌
నిజాయితీ లోపం
: ఈ సారీ కేవలం సంఘర్షణను నివారించడానికి చెప్పే ఒక సాధనం. ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు. ఇది ‘సారీ’ అనే పదం విలువను తగ్గిస్తుంది.
భావాల నిర్ధారణ లేకపోవడం: వరుణ్‌ శతి బాధను తగ్గించడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె భావాలను గుర్తించడంలో విఫలమయ్యాడు. ”నేను చాలా బిజీగా ఉన్నాను” అని చెప్పడం ద్వారా, అతను తన తప్పుకు సాకు వెతుక్కుంటున్నాడు.
నమ్మకం కోల్పోవడం: పునరావతమయ్యే తప్పులకు క్షమాపణలు చెప్పడం వలన, భాగస్వామిపై నమ్మకం, గౌరవం తగ్గుతుంది. శతి దష్టిలో, వరుణ్‌ చెప్పే ‘సారీ’ విలువైనది కాదు.

కొటేషన్‌ : ”మీరు క్షమాపణ చెప్పిన తర్వాత మీ ప్రవర్తన మారకపోతే, ఆ క్షమాపణ ఒక ‘యుక్తి’ మాత్రమే, నిబద్ధత కాదు”. (If your behavior hasnd’t changed
after you apologize, the apology was a tactic, not a commitment.)

కీలక అంశం: ‘నేను సారీ’ కంటే ‘నువ్వు ముఖ్యమైన దానివి’.
దాంపత్యంలో సారీ చెప్పడానికి కావాల్సిన మానసిక బలం అహంకారాన్ని వదిలిపెట్టి, బంధానికి ప్రాధాన్యం ఇవ్వడంలో ఉంది.
లక్షణం : బలం – నిజమైన సారీ. బలహీనత – సారీ.
ఉద్దేశ్యం బంధాన్ని రిపేర్‌ చేయడం, భాగస్వామి భావాలకు విలువ ఇవ్వడం. గొడవను ఆపడం బాధ్యత నుండి తప్పించుకోవడం.
మానసిక స్థితి సానుభూతి, బాధ్యతాయుతమైన వైఖరి, భయం, అపరాధ భావన లేదా తక్కువ ఆత్మగౌరవం.
ఫలితం విశ్వాసం పెరుగుతుంది, అనుబంధం బలోపేతమవుతుంది. విశ్వసనీయత కోల్పోవడం, రిలేషన్‌ షిప్‌ బలహీనపడటం.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -