నవతెలంగాణ-జుక్కల్: మండలంలోని చండేగావ్ గ్రామంలో సర్పంచ్ లక్ష్మణ్ బండేడ్ వార్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారని గ్రామ పంచాయతీ కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిపి కార్యవర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ పెద్దలు, కార్యవర్గ సభ్యులు చేతుల మీదుగా చెక్కలు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. పేదింటి ఆడ పిల్లలకు కళ్యాణ లక్ష్మీ , షాదీముబారక్ ఆర్థిక భరోసాను కల్పిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, జీపీ కార్యదర్శి వికాస్ రెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



