Monday, June 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్‌ బిల్లులు..రైతుల ఇక్కట్లు

పెండింగ్‌ బిల్లులు..రైతుల ఇక్కట్లు

- Advertisement -

30 నెలలు రెండు, 
మూడు పెండింగ్‌‌లోనే
విజయ డెయిరీ తీరుతో వ్యవస్థ అస్తవ్యస్తం
టీఐబీ ఫండ్‌ పంపిణీలోనూ జాప్యం
నేడు విజయ డెయిరీ 
ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించనున్న పాడి రైతులు


‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విజయ డెయిరీలో రైతులకు చెల్లించాల్సిన బిల్లులు ఎప్పుడూ రెండు, మూడు పెండింగ్‌‌లో ఉంటున్నాయి. టీఐబీ ఫండ్‌ ‌పంపిణీలోనూ తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో పాడి రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లుల క్లియరెన్స్‌‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించకుంటే జూన్‌ 15 ‌నుంచి పాల సరఫరా నిలిపివేస్తామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని సోమవారం హైదరాబాద్‌‌లోని లాలా పేటలో గల విజయ డెయిరీ ప్రధాన కార్యాలయాన్ని పాడి రైతులు ముట్టడించనున్నారు. రైతులు పాలు పోసే సమయంలో ప్రతి లీటర్‌‌పైనా రూ.1.50ని డెయిరీ కట్‌ ‌చేస్తున్నది. ఆ డబ్బులను తిరిగి జిల్లాలకు తిరిగి పంపిణీ చేయాలి. ఆ డబ్బులతో పశువుల దాణాను రైతులకు సబ్బిడీ ద్వారా అందించాలి. కానీ, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో ఆ సర్కిల్‌ ఆగిపోయింది. ‌దీంతో రైతులు పశువుల దాణా కొనుగోలు కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ముద్ర, తదితర లోన్ల ద్వారా పశువులను కొనుగోలు చేసిన రైతులు పాలరేట్లు సరిగా లేక, పాల బిల్లులు సకాలంలో అందక పాల రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. లోన్లు రెగ్యులర్‌‌గా కట్టడం లేదనే విషయంపై పలు జిల్లాల్లో బ్యాంకు అధికారులు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. పెట్రోల్‌, డీజిల్‌ ‌రేట్లు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో మినరల్‌ ‌మిక్చర్‌, కాల్షియం, తదితరాల దాణా ఖర్చులు పెరిగిపోయాయి. అదే సమయంలో విజయ డెయిరీ మాత్రం రైతులకు చెల్లించే పాల ధర రేట్లను మాత్రం పెంచడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విజయ డెయిరీ ద్వారా పాలు, పెరుగు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులను అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, దేవాలయాలకు సరఫరా చేస్తున్నది. దానికి సంబంధించి విజయ డెయిరీకి రూ.41 కోట్ల మేరకు పెండింగ్‌‌లో ఉన్నట్టు తెలిసింది. ఈ విషయంపై పలుమార్లు క్ష‍ేత్రస్థాయిలో అధికారులకు చాలాసార్లు వినతిపత్రాలు అందజేసి విసిగిపోయారు.

విజయ పాల రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే..
పెండింగ్‌ ‌బిల్లులను వెంటనే క్లియర్‌ ‌చేయాలి.
15 రోజులకోసారి విధిగా పాల బిల్లుల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలి.
దాణాను సబ్సిడీపై ఇవ్వాలి
దాణా ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పాల సేకరణ ధరను పెంచి లీటర్‌‌కు కనీసం రూ.50 ఇవ్వాలి.
పాడి రైతులకు బోనస్, ప్రోత్సాహకాలు అందించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -