Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొంపల్లి పార్వతి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కరపత్ర ఆవిష్కరణ..

కొంపల్లి పార్వతి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కరపత్ర ఆవిష్కరణ..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు: కొంపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 15 నుండి 19 వరకు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలవాల్ పోస్టర్స్, కరపత్రాల దాతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెదిరే విజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కొంపల్లిలో ఐదు రోజులపాటు మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు భక్తులు వేలాదిగా తరలిరావాలని కోరారు. బ్రహ్మోత్సవాలలో సాంప్రదాయ సంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రితిక హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మొగుదాల నరసింహ గౌడ్ సహకారంతో నియోజవర్గ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు యువకులు పాల్గొని తమ ప్రతిభ కనబరిస్తే మొదటి బహుమతి 30 వేలు , రెండవ బహుమతి 15 వేలు , మూడవ బహుమతి 7500 అందించనున్నట్టు తెలిపారు . ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ లు జీడిమడ్ల నరేష్ , జీడిమడ్ల మౌనిక సురేష్, సూర శ్రీశైలం , మాజీ సర్పంచ్ బోయపర్తి లింగయ్య , గ్రామ ప్రజలు జీడిమడ్ల వెంకటయ్య , వడ్డేపల్లి శంకర్ , సుర శంకర్ , సంకు శంకర్ , మొగుదాల రాంప్రసాద్ , సూర శ్రీశైలం , డి శంకర్ , చుక్క శంకర్,చుక్క నరేందర్ , వెంకటయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -