ఈనెల 22 న విజయవాడ లో జరిగే బిసి సింహ గర్జనను విజయవంతం చేయండి..
తెలంగాణ పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ మెంబర్ తీగల అశోక్
నవతెలంగాణ- మునుగోడు
చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ పొలిటికల్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మెంబర్ తీగల అశోక్ కోరారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలో వివిధ బీసీ సంఘాల నాయకులతో కలిసి ఈనెల 22న విజయవాడలో జరిగే బిసి సింహ గర్జన వాల్ పోస్టర్ ను అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు మునుగోడు లో వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో బీసీలపై జరుగుతున్నా దాడులను ఖండించారు.
బిసి కులాల కార్పొరేషన్ నిధులను పూర్తిగా విడుదల చేయాలని, సమగ్ర కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాల, స్థానిక సంస్థలు మరియు చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలను కోరారు.బిసి సింహ గర్జన కు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘాల నాయకులు జిట్టాగోని కృష్ణకుమార్, నెల్లికంటి రాఘవేంద్ర, నిమ్మల నాగార్జున , మునుగాల శ్రీనివాస్ చారి, బోయపల్లి స్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



