Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం20న వ్యకాస బహిరంగ సభను జయప్రదం చేయండి

20న వ్యకాస బహిరంగ సభను జయప్రదం చేయండి

- Advertisement -
అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
20, 21, 22 తేదీల్లో వ్యకాస రాష్ట్ర నాలుగో మహాసభ

నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
మహబూబ్‌నగర్‌ పట్టణంలో జూన్‌ 20న జరగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌లోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వలసలకు నిలయమైన పాలమూరు జిల్లాలో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. అత్యంత కరువు సమయంలో ఈ ప్రాంతంలో వ్యవసాయ కార్మిక సంఘం అంబలి కేంద్రాలు, గంజి కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈ మహాసభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌ హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి 1000 మంది ప్రతినిధులు, ఐదు రాష్ట్రాల నుంచి నాయకులు పాల్గొంటారని చెప్పారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని వెంకట్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందని, ఉపాధి హామీ కూలీలకు వరంలాంటి చట్టాన్ని మార్చి వీబీజీ ఆర్‌ఏఎం-జీ పథకం పేరుతో తెచ్చి ఉపాధి పనిని దూరం చేస్తోందన్నారు. గతంలో 90 శాతం నిధులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ద్వారా కేవలం 60 శాతం కేటాయిస్తామని, మిగతా 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి కడియాల మోహన్‌, సీఐటీయూ సీనియర్‌ నాయకులు కిల్లే గోపాల్‌, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏ.రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, నాయకులు రాజకుమార్‌, శివవర్మ పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -