సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.. ఎం డి జహంగీర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కన్నెర్ర చేస్తూ దేశవ్యాప్త కార్మిక సంఘాల జాతీయ సమ్మెలో భాగంగా భువనగిరి పట్టణంలో సిఐటియు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షక మహా ప్రదర్శన సాయిబాబా గుడి నుండి ప్రారంభమై పాత బస్టాండ్, గంజ్, మెయిన్ రోడ్డు , మీదుగా జగ్జీవన్ రామ్ చౌరస్తా వరకు మహా ప్రదర్శన కొనసాగింది. అనంతరం దాసరి పాండు అధ్యక్షతన జరిగిన సభలో కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలోనే లక్షలాదిమంది కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా మార్చిందని అన్నారు.
ఈ లేబర్ కోడ్ల వల్ల మేనేజ్మెంట్కు కార్మికులు కట్టు బానిసల్లా ఊడిగం చేసే కార్పోరేట్ శక్తులకు ఏదేచ్ఛగా శ్రమ దోపిడీ చేసుకునేందుకు వీలుగా ఈ లేబర్ కోళ్లు తెచ్చిందని అన్నారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఎనిమిది గంటల పని స్థానంలో 12 గంటల పని చేయాల్సి వస్తుందని, కార్మికులు సంఘం పెట్టుకొని హక్కు, తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. భవిష్యత్తులో కార్మికుల భద్రత ఎండమావిగా మారుతుందని, వీటిని రద్దయేంతవరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధిని సాధించిన వ్యవసాయ రంగంలోకి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ విద్యుత్ ప్రైవేటీకరణ కోసం విద్యుత్ సవరణచట్టం తీసుకొచ్చిందని తెలిపారు.
ఈ విద్యుత్ సవరణబిల్లు అమల్లోకి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయపంపుసెట్ల పైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్న లక్షలాది మంది రైతులు ఉచితంగా పొందుతున్న కరెంటును కోల్పోయి కరెంట్ బిల్లులు చెల్లించలేక ఆత్మహత్యలపాలయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే ఆంధ్రలో స్మార్ట్ మీటర్లు పెట్టి బిల్లుల వసూళ్లకు పూనుకుంటున్నారని అక్కడి రైతాంగం తిరగబడుతుందని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పొందుతున్న పేదలు ఉచిత విద్యుత్ కోల్పోయి కరెంటు చార్జీల భారాలు మోయాల్సి వస్తుందని అన్నారు.
విత్తన సవరణ చట్టం 2025 తీసుకొచ్చి విదేశీ బహుళ జాతి విత్తన సంస్థలకు తలుపులు బార్లా తెరిచిందని 100% ప్రైవేటు విత్తన సంస్థలకు దేశీయ విత్తన రంగాన్ని అప్పగించడం ద్వారా విత్తన భాండాగారంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తిలో ఇప్పటికే 20 దేశాలకు విత్తనాలను సప్లై చేస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని ఈ విత్తన చట్టం తోటి దేశీయ విత్తన కంపెనీలు మూతపడతాయని, విదేశీ జన్యు విత్తనాల వల్ల అనేక రకాల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని దేశీ రైతులు నష్టపోతారని వెంటనే విత్తన సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాన్ని స్థానంలో విబిజి రాంజీ అనే స్కీమ్ తెచ్చి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న చట్టాన్ని రద్దుచేసి 90% కేంద్ర ఇవ్వాల్సిన నిధులని 60 శాతాన్ని కుదించి రాష్ట్రాలపై 40 శాతం నిధిలిస్తేనే ఉపాధి పనులు చేపట్టాలనేటువంటి కొత్త నిబంధనలు తీసుకొచ్చి రాష్ట్రాలపై పెను భారాన్ని మోపిందని తద్వారా ఉపాధి పనికి మంగళం పాడాలని చూస్తున్నదని గ్రామీణ పేదలని పొట్ట గొట్టే ఇలాంటి దుర్మార్గమైన విధానాలపై వ్యవసాయ కూలీలు రైతాంగం కార్మిక వర్గం మరింత పట్టుదలతో పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్, సామాజిక వేత్త బట్టు రామచంద్రయ్య, యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం , యాదయ్య, టిఆర్ఎస్కెవి జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి, హెచ్ఎంఎస్ జిల్లా కార్యదర్శి తీగల మధు, సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు మాతయ్య, అంగన్వాడి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిల్వేరు రమా కుమారి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కసగోని లలిత, హమాలీ యూనియన్ నాయకులు రమేష్, ఏఐటీయూసీ నాయకులు లక్ష్మయ్య, ప్రజా ఫ్రంట్ నాయకులు మహేష్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు బొల్లేపల్లిస్వామి, నాయకులు అరుణ, శంకర్, రమేష్, స్వామి, సత్తయ్య, సరిత, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, పిఎన్ఎమ్ జిల్లా కార్యదర్శి ఈ ర్లపల్లి ముత్యాలు, మచ్చ భాస్కర్, రాహుల్ లు పాల్గొన్నారు



