నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలను సిఐటియు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు సౌందరరాజన్ తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చెన్నైలోని గిండిలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వ్యవసాయ కార్మికులతో సహా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికులు పాల్గొనడంతో వారిని ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే మోడీ సర్కార్ ఉపసంహరించుకోవాలని, ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేకమైందన్నారు, యజమాని అనుకూలమైన 25 కార్మిక చట్టాలను సవరించి, ఏకీకృతం చేశారని మండిపడ్డారు. కొత్త లేబర్ కోడ్‌లు ప్రాథమిక హక్కులకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త లేబర్ కోడ్‌లు ప్రాథమిక హక్కులకు ముప్పు: సౌందరరాజన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



