Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ ‌కార్మికులకు రూ.26వేల వేతనమివ్వాలి

మున్సిపల్‌ ‌కార్మికులకు రూ.26వేల వేతనమివ్వాలి

- Advertisement -

పర్మినెంట్‌ ‌చేసి పీఎఫ్‌,
ఈఎస్‌ఐ, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలి :
సీఐయూ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
‘ఎంఎంసీ’ కార్యాలయం ధర్నా.. కమిషనర్‌‌కు వినతి


నవతెలంగాణ-సిటీబ్యూరో

మల్కాజిగిరి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌‌లో విలీనమైన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోని చేస్తున్న మున్సిపల్‌ ‌కార్మికులకు జీహెచ్‌ఎంసీలో చెల్లిస్తున్న వేతనాలు చెల్లించాలని సీఐయూ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ ‌చేశారు. మున్సిపల్‌ ‌సిబ్బందిని పర్మినెంట్‌ ‌చేయాలనీ, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలనీ, విలీనమైన పంచాయతీ కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలనీ, ప్రమాద బీమా. ఇన్సూరెన్స్ రూ.25 లక్ష‍లు చెల్లించాలనీ, కార్మికుల తొలగింపు, బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ మున్సిపల్‌ ‌వర్కర్స్ అండ్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌ (‌సీఐటీయూ) మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తార్నాకలోని మల్కాజిగిరి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ ‌మాట్లాడుతూ సీఎం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనీ, వేతనాలు పెంచకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్‌ ‌కార్మికులను పర్మినెంట్‌ ‌చేయకపోతే సీఎంను మూసీలో కలుపుతామన్నారు.

కార్మికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయొద్దనీ, వేతనాల్లో కోత విధించొద్దన్నారు. సమాన పనికి సమాన వేతన చట్టం ప్రకారం పర్మినెంట్‌ ‌కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలనే చెల్లించే విధంగా నిర్ణయం చేసి ఆలోగా కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలన్నారు. విలీన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోని కార్మికుల సమస్యలు పరిష్కరించి ప్రమాదాల్లో మరణిస్తున్న కార్మికులకు రూ.25 లక్ష‍ల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఆదివారాలు, పండుగ సెలవులు, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలన్నారు. మున్సిపల్‌ ‌కార్మికులందరికీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి డబుల్‌ ‌బెడ్‌‌రూం, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ ‌చేశారు. బయోమెట్రిక్‌ ‌విధానంలో మార్పులు చేయాలనీ, పని ప్రదేశాల వద్దనే వన్‌‌టైం హాజరు తీసుకోవాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే వర్షాకాలంలో ఎక్కడి చెత్తను అక్కడే వదిలేసి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ ‌మాట్లాడుతూ ఈ ధర్నా లాంఛనంగా మాత్రమే అనీ, సమస్యలు పరిష్కరించకపోతే అసలు పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వర్షాకాలంలో సమ్మెకు వెళ్తే సర్కారే దిగొస్తుందన్నారు. ఈ 2026లో సమస్యలు పరిష్కారం కాకపోతే కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.చంద్రశేఖర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.శ్రీనివాసులు, యూనియన్‌ ‌రాష్ట్ర కమిటీ సభ్యులు కె.నాగరాజు, అనురాధ, వెంకన్న, లీల, బాలనర్సింహ్మ, సీఐటీయూ మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్ష‍ులు ఎన్‌.శ్రీనివాసులు, కోశాధికారి గణేష్‌, జిల్లా నాయకులు జె.వెంకన్న, ఉన్ని కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు యాదయ్య, నర్సింగరావు, సృజన, తదితరులు పాల్గొన్నారు.
యూనియన్‌ ‌రాష్ట్ర కమిటీ సభ్యులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -