- Advertisement -
బెంగళూరు : హెచ్‌సీఎల్ టెక్, గూగుల్ క్లౌడ్ భాగస్వామ్యంతో కాలిఫోర్నియాలో అత్యాధునిక ఏఐ ఇన్నోవేషన్ జోన్ను ప్రారంభించింది. గూగుల్ జెమిని ఎంటర్‌ప్రైజ్ ఆధారంగా పనిచేసే ఈ ల్యాబ్ ద్వారా అంతర్జాతీయ సంస్థలు తమ వ్యాపారాలకు అవసరమైన అధునాతన ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రయోగాల దశను దాటి ఏఐ ఇప్పుడు వ్యాపారాల్లో స్పష్టమైన ఫలితాలను ఇచ్చే స్థాయికి చేరిందని గూగుల్ క్లౌడ్ ప్రతినిధి కెవిన్ ఇచ్‌పురానీ పేర్కొన్నారు.
- Advertisement -



