సెమీస్‌లో యమగూచి చేతిలో ఓటమి
ఆస్ర్టేలియన్ ఓపెన్ సూపర్ 500
సిడ్నీ (ఆస్ర్టేలియా) : జపాన్ షట్లర్, వరల్డ్ నం.3 అకానె యమగూచి అప్రతిహాత జోరు కొనసాగుతుంది. నాలుగు వారాల్లో వరుసగా నాల్గో ఫైనల్స్‌కు చేరుకున్న యమగూచి కెరీర్ భీకర ఫామ్ చాటుకుంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో వరల్డ్ నం.10 పి.వి సింధుపై యమగూచి 22-20, 21-12తో వరుస గేముల్లో గెలుపొంది ఆస్ర్టేలియన్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. కెరీర్ ముఖాముఖి రికార్డు పరంగా 15-14తో సింధు మెరుగైన స్థితిలో నిలిచినా.. 2022 నుంచి సింధుపై యమగూచి అజేయ రికార్డు కొనసాగిస్తోంది. 43 నిమిషాల్లో ముగిసిన శనివారం నాటి సెమీఫైనల్లో యమగూచి మెరుపు విజయం సాధించింది. తొలి గేమ్‌లో సింధు 11-9తో ముందంజలో నిలిచింది. సెకండ్‌హాఫ్‌లోనూ యమగూచిపై పైచేయి సాధించింది. 19-18తో సింధు తొలి గేమ్ నెగ్గేలా కనిపించినా.. యమగూచి గొప్పగా పుంజుకుంది. 20-20 వద్ద వరుస పాయింట్లతో టైబ్రేకర్‌లో తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక కీలక రెండో గేమ్‌లో సింధు చేతులెత్తేసింది. ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. 11-6తో విరామ సమయానికి భారీ ఆధిక్యం సాధించిన యమగూచి అదే జోరులో రెండో గేమ్‌ను ఫైనల్లో చోటును సొంతం చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో రెండో సీడ్ చొచువాంగ్ (థాయ్‌లాండ్) తో యమగూచి తలపడనుంది. థాయ్‌లాండ్ ఓపెన్ విజేతగా నిలిచిన యమగూచి.. సింగపూర్, ఇండోనేషియా ఓపెన్‌లో వరల్డ్ నం.1 ఆన్ సె యంగ్‌కు టైటిల్ కోల్పోయి రన్నరప్‌గా నిలిచింది.
సింధు నిష్ర్కమణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



