ప్రజలను మోసం చేసేందుకే హడావుడి
జిల్లాలో ఇద్దరు మంత్రులూ అసమర్థులే
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శ
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
నల్లగొండలో ఈ నెల 17న పెద్ద స్కామ్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారని, కమీషన్ల కోసమే హ్యాం రోడ్లు అంటూ హంగామా చేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ స్థాయి ఏజెంట్ లు ప్రతి రోజూ బీఎల్ఓతో పాటే ఇంటింటికీ తిరుగుతూ అన్నీ పరిశీలించాలన్నారు. అందరి ఓట్లు కాపాడేలా పకడ్బందీగా పని చేయాలని సూచించారు. అనుమానం వస్తే వెంటనే ఆర్డీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయాలని చెప్పారు. కోతల వెంకటరెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ప్రజలను మోసం చేసేందుకు డ్రామాలు అడుతున్నారని మంత్రినుద్దేశించి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అందుకే హ్యాం రోడ్లు అంటూ ఆర్భాటం చేస్తున్నారని, ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాకు సీఎం ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులూ అసమర్థులే అని విమర్శంచారు. ఇద్దరు మంత్రులు స్కామ్‌లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని, మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. తన తమ్ముడికి పదవి వచ్చి తన పదవి పోయేలా ఉందని. అందుకే ఈ జిల్లా మంత్రి సీఎం రేవంత్‌రెడ్డిని కాకా పట్టేందుకు సభ పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాల జిల్లా ఇన్‌చార్జి ఆర్ఎస్ .ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ బండ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
కమీషన్ల కోసమే హంగామా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



