- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని సదగోడు గ్రామ శివారులో ఉప్పునుంతల–సదగోడు గ్రామాల మధ్య రహదారి పక్కన ఉన్న విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలే పరిస్థితి నెలకొంది. దీంతో స్థానిక రైతులు తాత్కాలికంగా ప్రమాదాన్ని నివారించేందుకు తీగలను తాడుతో వేలాడదీసి సమీపంలోని చెట్టుకు కట్టారు. అయితే వర్షానికి తడిసిన తాడు విద్యుత్ తీగలను తాకిన పక్షంలో విద్యుత్ ప్రసరించి, సమీపంలో సంచరించే రైతులు, పశువులు, వాహనదారులు విద్యుత్ షాక్కు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



