- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; నేషనల్ ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ వసూలు నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. ఇకపై పూర్తిగా అందుబాటులోకి రాని ఎక్స్‌ప్రెస్ వేల్లో మొత్తం టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. పనులు పూర్తయిన మేరకే ఛార్జీలు వసూలు చేస్తారు. ఆదివారం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దాంతో కొంత భాగమే ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ భారం తగ్గనుంది. ప్రస్తుతం నేషనల్ హైవేలతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్ వేలపై 25% ఎక్కువగా వసూలు చేస్తున్నారు.
- Advertisement -



