Sunday, June 14, 2026
E-PAPER
Homeజిల్లాలుసర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులుగా కొండ రాజమ్మ

సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులుగా కొండ రాజమ్మ

- Advertisement -

సత్కరించిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు

సర్పంచ్లు ఎన్నికై ఆరు నెలలు కావస్తోంది.ఎప్పుడెప్పుడోని ఎదురుచూస్తున్న సర్పంచ్ల ఫోరమ్ ఎన్నిక ఎట్టకేలకు తెరపడింది. మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులుగా మండలంలోని కొయ్యుర్ గ్రామ సర్పంచ్  కొండ రాజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాజమ్మను సాధారణంగా ఆహ్వానించి, సత్కరించారు. తనపై నమ్మకంతో  సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులుగా నియామకం చెసిన రాష్ట్ర మంత్రి శ్రీథర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబులకు రాజమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇందుకు సహకరించిన రాష్ట్ర ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ దండు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి పరిస్కారం అయ్యేలా కృషి చేస్తూ, హక్కులపై పోరాటం చేస్తానని ఈ సందర్భంగా రాజమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు జంగిడి శ్రీనివాస్, మేకల రాజయ్య, బండారి నర్సింగం, బండి స్వామి, చంద్రగిరి సంపత్, అబ్బినేని లింగస్వామి, బెల్లంకొండ జ్యోస్న-సరిన్ రావు, బొమ్మ రజిత-రమేష్ రెడ్డి, గడ్డం క్రాంతి, జాడి రాములు, ఒర్రె వనమ్మ, గుగులోతు మంజుల, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -