Monday, June 15, 2026
E-PAPER
Homeజిల్లాలువర్థన్నపేటలో పేద విద్యార్థులకు అల్పాహారం ప్రారంభం

వర్థన్నపేటలో పేద విద్యార్థులకు అల్పాహారం ప్రారంభం

- Advertisement -

ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి
నవతెలంగాణ-వర్ధన్నపేట

పేద విద్యార్థులకు వరంల అల్పాహార పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఉదయాన్నే పాఠశాలలో అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం నాణ్యమైన విద్య పేద విద్యార్థులకు అందడం అదృష్టంగా భావించాలని వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహార పథకాన్ని మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి వర్ధన్నపేటలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆకలితో తరగతి గదులకు వెళ్లకుండా, ఉదయం నుంచే ఉత్సాహంగా విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి అల్పాహార పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు.

ఈ పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. విద్య పరంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు. మెరుగుపడటమే కాకుండా విద్యా ఫలితాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, డిజిటల్ విద్య వంటి అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని, ఇప్పుడు అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

వర్ధన్నపేట శాసన సభ్యులు కె.ఆర్. నాగరాజు ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి, వార్డు కౌన్సిలర్ బెజ్జం పాపరావు,నునవత్ కిమిలి,మాలోతు దేవేందర్,తిరుపెల్లి వాణి, వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, డి.సి తండా ప్రధానోపాధ్యాయులు పి. వేణు, నీలగిరిస్వామీ తండా ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, ఇతర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు నాయకులు నేతవాత్ రాజేందర్, కిమా నాయక్, తిరుపెల్లి కుమారస్వామీ,అనిమిరెడ్డి రాంచంద్ర రెడ్డి, కొండేటి కుమారస్వామీ, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల సైతం అల్పాహారం తిని సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -