జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ఆదేశం
నవతెలంగాణ-మద్నూర్
మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు తనవంతు కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ అన్నారు. ఆలయం చుట్టూ కాంపౌండ్ వాల్, ఆలయానికి వచ్చే రహదారిని ఎప్పుడో వేసిన రోడ్లని, ప్రస్తుతం సీసీ రోడ్లు వేద్దామని, వీటితో పాటు డ్రైనేజీ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇందుకు సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళికలు పకడ్బందీగా సిద్ధం చేసి తనవద్దకు తీసురావాలని సూచించారు. వాటిని పరిశీలించి, ఆలయంలో జరగాల్సిన పనులు, వాటికయ్యే నిధుల ఖర్చు ఓ అంచనా వస్తుందని తెలిపారు. ఇందుకు ఆలయ కార్యనిర్వహణాధికారులు, గ్రామస్థులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంజనేయస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



