హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ లో నిరుద్యోగుల మెరుపు ర్యాలీ
ఒక్కసారిగా వందలాదిగా తరలివచ్చిన యువత
స్తంభించిన హైదరాబాద్-విజయవాడ హైవే
యువకులపై విరిగిన లాఠీ ..పోలీసు స్టేషన్లకు తరలింపు
నవతెలంగాణ – దిల్ సుఖ్ నగర్
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు ఆకస్మిక ర్యాలీ చేపట్టారు. దాంతో ఒక్కసారిగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి స్తంభించింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు వందలాది మంది నిరుద్యోగులు దిల్ సుఖ్ నగర్ చౌరస్తాకు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వివిధ మార్గాల నుంచి వచ్చిన నిరుద్యోగులు మలక్ పేట రోడ్, కొత్తపేట రోడ్ ను పూర్తిగా ఆక్రమించుకుని నిరసన చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు నిరుద్యోగులను శాంతింప జేయడానికి ప్రయత్నించారు. అయితే,వారు శాంతించకుండా ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరుద్యోగులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాదు కానీ పోలీసులతో దాడులు చేయించడం చేతనవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



