Wednesday, June 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజులై 19 నుంచిబోనాలు

జులై 19 నుంచిబోనాలు

- Advertisement -

ఆగస్టు 2న సికింద్రాబాద్
ఉజ్జయిని మహంకాళి బోనాలు

​నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
​ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆషాఢ బోనాల జాతర మహోత్సవాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది నిర్వహించబోయే వార్షిక బోనాల జాతర కార్యక్రమాల అధికారిక షెడ్యూల్ వివరాలను ‌మంగళవారం ఆలయ చైర్మెన్‌, అర్చక బృందం కలిసి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కి అందజేశారు. జాతరను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఆలయ దేవస్థానం ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం జూలై 19వ తేదీ (ఆదివారం) సాయంత్రం 4:00 గంటలకు అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు) కార్యక్రమంతో ఈ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం జాతరలో అత్యంత కీలకమైన ప్రధాన బోనాల ఉత్సవాన్ని ఆగస్టు 2వ తేదీ (ఆదివారం) తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రారంభిస్తారు. ఆ రోజంతా లక్షలాది మంది మహిళలు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు. జాతర మరుసటి రోజైన ఆగస్టు 3వ తేదీ (సోమవారం) ఉదయం 8:30 గంటలకు భవిష్యవాణిని వినిపించే ‘రంగం’ కార్యక్రమం జరగనుంది. అదే రోజు ఉదయం 10:30 గంటలకు అమ్మవారి గజవాహన ఊరేగింపు మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -