Thursday, June 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోలీస్ సేవలను సులభతరం చేస్తాం

పోలీస్ సేవలను సులభతరం చేస్తాం

- Advertisement -

డీజీపీ సివి.ఆనంద్
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్
నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభం


నవతెలంగాణ – మల్కాజిగిరి

పోలీసు వ్యవస్థకు, ప్రజలకు మధ్య దూరాన్ని తగ్గించి.. పోలీస్ సేవలను మరింత సులభతరం చేస్తామని డీజీపీ సివి.ఆనంద్‌ ‌తెలిపారు. పోలీస్ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతోపాటు పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన క్యాంపు కార్యాలయాన్ని బుధవారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డితో కలిసి డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ సేవలను వికేంద్రీకరించడం ద్వారా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రధాన కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదని, క్యాంపు కార్యాలయాల్లోనే ఫిర్యాదులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించే అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. మల్కాజిగిరి జోన్, ఉప్పల్ జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిపాలనా సమన్వయాన్ని బలోపేతం చేయడంలో ఈ క్యాంపు కార్యాలయం కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ రెండు జోన్ల పరిధిలోని మొత్తం 11 పోలీస్ స్టేషన్లపై పర్యవేక్షణ, పరిపాలనా నియంత్రణ కోసం ఈ కార్యాలయం సేవలు అందించనుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, జోనల్‌ ‌కమిషనర్‌ డిఎంటివి. కృష్ణారెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవి.రంగనాథ్, అడ్మినిస్ట్రేషన్ డీసీపీ, మల్కాజిగిరి జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -