Thursday, June 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికుల సంక్షేమమే ధ్యేయం

కార్మికుల సంక్షేమమే ధ్యేయం

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-కోహీర్, జహీరాబాద్

కార్మికుల సంక్షేమమే సీఐటీయూ ధ్యేయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దిగ్వాల్ పిరామల్ ఫార్మా పరిశ్రమలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం మరో చారిత్రాత్మక వేతన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి అగ్రిమెంటులో సాధించిన విజయాలను, అంశాలను వివరించారు. అనంతరం చుక్క రాములు మాట్లాడుతూ.. వేతన ఒప్పందం సాధించడం కార్మికుల సంక్షేమం పట్ల సీఐటీయూకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఫార్మా పరిశ్రమలో ఈ రకమైన వేతన ఒప్పందం జరగడం గొప్ప విషయమని, ఈ ఒప్పందం జరగడానికి కార్మికుల ఐక్యతే కారణమని అభినందించారు. సీఐటీయూ కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతుందన్నారు. యాజమాన్యాలతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తూ వారి సంక్షేమానికి కట్టుబడ్డ ఏకైక సంఘం సీఐటీయూ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్, యూనియన్ ప్రధాన కార్యదర్శి నరసయ్య, మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్స్ రాకూల్, యూనియన్ల నాయకులు నరేష్, మహేశ్వర్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -