Thursday, June 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదలు సన్న బియ్యం తినాలి

పేదలు సన్న బియ్యం తినాలి

- Advertisement -

రైతులు ఆర్థికంగా ఎదగాలి .. వారి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ సంకల్పం :డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
​నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
​రైతాంగాన్ని అదుకునేందుకు ప్ర‌జాప్ర‌భుత్వం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంద‌ని డిప్యూటీ సీఎం మల్లు భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.బుధవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ ‌రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భట్టి అధ్యక్ష‍తన జరిగిన సమావేశంలో మంత్రులు ఎన్‌. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు, నిల్వ సదుపాయాలు, వానకాలం సాగు పై క్యా బినెట్ సబ్ కమిటీ చ‌ర్చించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయంగా, అంత‌ర్జాతీయంగా డిమాండ్ ఉన్న మేలు రకాల సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. ‘పేదలు కూడా సన్న బియ్యం తినాలి. రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి. ఆ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళుతోంది’ అన్నారు. రైతులు బీపీటీ 5204, తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048), ‌కేఎన్‌ఎం -1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ రకాల వంగడాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతు క‌మిష‌న్ ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేసిందని గుర్తు చేశారు.

మేలుజాతి వంగ‌డాలు స‌మృద్ధిగా ఉన్నాయన్నారు. కాబ‌ట్టి వీటిని సాగు చేస్తే రైతుల‌కు ఆదాయం గ‌ణ‌నీయంగా ఉంటుద‌ని వ్య‌వ‌సాయ క‌మిష‌న్ తెలిపిందని చెప్పారు. ప్రభుత్వం ఈ వంగడాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, గ్రామ గ్రామాన రైతులను చైతన్యపరిచేందుకు ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. రాబోయే సీజన్లలో ఈ రకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా అటు రైతులకు అదనపు ఆదాయం, ఇటు మార్కెట్ రంగానికి పూర్తి ప్రయోజనం చేకూరుతుందన్నారు. వరి సాగులో తెలంగాణ రాష్ట్రం మరింత లాభదాయకమైన దిశగా అడుగులు వేస్తుందని వ్యవసాయ క‌మిష‌న్ సైతం కేబినెట్ సబ్ కమిటీకి నివేదించిందని తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. కొనుగోళ్ళకు తగ్గిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతోందని చెప్పారు. బాయిల్డ్ రైస్ ను ఏమాత్రం కొనుగోలు చేయడం లేదన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంద‌ని చెప్పారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మెన్‌ కోదండరెడ్డి, సీడ్ కా‌ర్పొరేషన్‌ ‌చైర్మెన్‌ అన్వేష్ రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జాతీయ మిల్ల‌ర్ల సంఘం అధ్య‌క్షు‌లు దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -