ఫేస్ రికగ్నైజ్డ్ విధానంలో అమలుకు సిద్ధం
మొదట ఆచార్యులకు, ఉద్యోగులకు.. తర్వాత
విద్యార్థులకు
మ్యాన్యువల్ అటెండెన్స్ కు
మంగళం
హాజరుతో వేతనాలకు లింక్
టెక్నాలజీని జోడించి మార్పు
దిశగా అడుగులు : ఓయూ వీసీవి ప్రొ. కుమార్
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమయపాలన, పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే లక్ష్యంతో ఫేస్ రికగ్నైజ్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. జులైలో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రానుండగా, తొలి దశలో బోధన, బోధనేతర ఉద్యోగులకు అమలు చేసి, అనంతరం విద్యార్థులకు విస్తరించనున్నారు. విశ్వవిద్యా లయంలోని కళాశాలలు, విభాగాలు, పరిపా లన భవనం, డీన్లు, డైరెక్టర్ల కార్యాల యాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల వివరాలు, ఫొటోలు సేకరించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.
తొలి దశలో ఆచార్యులు, ఉద్యోగులకు..
బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్‌లో మొదటి దశలో టీచింగ్, నాన్-టీచింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ లెక్చరర్లు, టైమ్‌స్కేల్ ఉద్యోగులను ఈ విధానంలో చేర్చనున్నారు. రెండో దశలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ, ప్రయివేటు విద్యాసంస్థల విద్యార్థులకు అమలు చేసినందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
హాజరుతో వేతనాల అనుసంధానం
ఉద్యోగుల హాజరును పూర్తిగా సెంట్రలైజ్ చేసి, వేతనాలతో అనుసంధానం చేయను న్నారు. ఉద్యోగులు ఎప్పుడు విధులకు హాజర య్యారు, ఎప్పుడు వెళ్లారు, ఎంతసేపు పనిచే శారు అనే వివరాలు యూనివర్సిటీ పరిపా లనకు తక్షణమే అందుబాటులో ఉంటాయి. సమయపాలనలో లోపం ఉంటే సెలవులపై ప్రభావం పడేలా నిబంధనలు రూపొంది స్తున్నారు. ఈ విధానం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో, కాకతీయ విశ్వవిద్యా లయంలో విజయవంతం గా నిర్వహిస్తున్న వేళ ఓయూ కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది.
డేటా సేకరణ
యూనివర్సిటీ ఉద్యోగుల డేటాను సదరు కంపెనీకి ఇవ్వడంతో వారు ఇంజినీరింగ్ కళాశాల, పరిపాలన భవన్ , సైన్స్ కళాశాల, దూరవిద్యా కేంద్రంతో పాటు 80 శాతం ఉద్యోగుల వివరాలు తీసుకున్నారు. ప్రస్తుతం స్వయంగా ఉద్యోగి ఫొటోలు తీసుకుం టున్నారు. ఫేస్ రికగ్నైజ్డ్ డివైస్ ఈ మిషన్స్‌ను కాలేజీలలోని విభాగాలు పలు సెంటర్లలో ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఉద్యోగీ తప్పనిసరిగా తాను పని చేస్తున్న చోటనే అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు అడ్మినిస్ట్రేషన్ అధికారులకు అడ్మినిస్ట్రేషన్ వద్ద, అలాగే తమ మాతృ విభాగాల్లో అటెండెన్స్ ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించారు. గతంలో ఓయూలో పలు కళాశాలల్లో, విభాగా ల్లోని కార్యాలయాల్లో బయోమెట్రిక్ ఉన్నా జవాబుదారీతనం లోపించడంతో నేడు సెంట్ర లైజ్డ్ హాజరు విధానాన్ని తీసుకొచ్చారు. సమ యపాలన , పారదర్శ కత, వర్క్ అవుట్ పుట్ పూర్తిస్థాయిలో మాని టరింగ్ ఉంటుం దని, ప్రధానంగా పేపర్ రహిత విధానం అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అడ్మినిస్ట్రే షన్ మానిటరింగ్ కూడా సులభంగా ఉంటుం దని, ఇప్పటివరకు మ్యాను వల్ విధానంలో కొన్నిచోట్ల హాజరు సేకరిస్తుండగా ఈ విధానం ద్వారా ఆటోమేటిక్ గా అటెండెన్స్ అడ్మినిస్ట్రేషన్ కు క్షణాల్లో వస్తుందని తెలిసింది. త్వరగా ప్రతి ఉద్యోగి డేటా కలెక్షన్ పూర్తి చేసి ఈ విధానాన్ని ఆరంభించడానికి కృషి చేస్తున్నారు.
సుమారు రూ.35 లక్షలు
సుమారు రూ.35 లక్షలతో ఈ సాఫ్ట్‌వేర్, బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ లేదా విద్యుత్ అంతరాయం ఉన్నా ఈ వ్యవస్థ పనిచేసేలా రూపొందించారు. పేపర్‌లెస్ విధానంలో హాజరు నమోదు కావడంతో పరిపాలనా పర్యవేక్షణ మరింత సులభం కానుంది. అలాగే సమయపాలనలో ఇది ఒక భాగం అని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడుసార్లు ఆలస్యంగా వస్తే ఒక సీఎల్ కట్ అవుతుందని, ఉద్యోగి హాజరు శాతంతోనే వేతనం లింక్ చేయనున్నట్టు అధికారులు చెప్పారు.
టెక్నాలజీ అనుసంధానంతో మార్పు దిశగా..
ఓయూ వీసీ ప్రొ.ఎం.కుమార్ ఉస్మానియా యూనివర్సిటీలో టెక్నాలజీ జోడించి మార్పు దిశగా అడుగులు వేస్తున్నాం. దానిలో భాగమే ఈ ఫేస్ రికగ్నైజ్ హాజరు సిస్టం. దీన్ని జులై నుంచి ప్రారంభిస్తాం. ఈ సిస్టం ఇంటర్నెట్, విద్యు త్తు లేకుండా కూడా పనిచేస్తుంది. త్వరలో వేతనాలకు సైతం లింక్ చేస్తాం. మొదట ఉద్యోగులకు అమలు చేసి, అనంతరం పీజీ, పీహెచ్‌డీ, యూజీ విద్యార్థులతో పాటు అనుబంధ ప్రయివేటు కళాశాలలకు విస్తరించనున్నాం. ఇప్పటికే చెక్కులు, డీడీలు, చలాన్ల స్థానంలో ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేశాం. ఈ కొత్త వ్యవస్థతో సమయపాలన, పనితీరు మరింత మెరుగుపడుతుంది.



