Friday, June 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసాంకేతికతను ప్రజాస్వామీకరిస్తేనే పురోగతి

సాంకేతికతను ప్రజాస్వామీకరిస్తేనే పురోగతి

- Advertisement -

పారిస్‌‌లో వివాటెక్‌ సదస్సులో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
పారిస్‌ : సాంకేతికతను ప్రజాస్వామీకరిస్తేనే పురోగతి సాధ్యమవుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ ‌గుర్తింపు వ్యవస్థను ఏర్పాటు చేయడం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ ‌చెల్లింపుల ప్లాట్‌‌ఫారాల వరకు సాంకేతికతను పెద్ద ఎత్తున భారత్‌ ఉపయోగిస్తోందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని విభాగాలు, విద్య, టెలి మెడిసిన్‌ ‌వంటి అనేక రంగాల్లో సాంకేతికతను విరివిగా వాడుతున్నామన్నారు. ఎఐ అంటే భారత్‌‌కు సంబంధించినంతవరకు ఆల్‌ ఇన్‌‌క్లూజివ్‌ (అందరినీ కలుపుకుని పోవడం) అని వ్యాఖ్యానించారు. ఇక్కడ జరుగుతున్న అంతర్జాతీయ సాంకేతిక సదస్సు వివాటెక్‌ 2026లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. యూరప్‌‌లోనే అతిపెద్ద టెక్నాలజీ, స్టార్టప్‌ ‌కార్యక్రమం ఇది. విదేశీ జాతీయులు ఆంథ్రోపిక్‌ ‌తాజా ఎఐ నమూనాలను ఉపయోగించడంపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు వెలువడ్డాయి. భారతదేశంలో పెరుగుతున్న వినూత్న ఆవిష్కరణల వ్యవస్థల గురించి, సాంకేతిక ముందంజ గురించి మోడీ ఈ సదస్సులో వివరించారు. సాంకేతిక రంగంలో ‌పెరుగుతున్న భారత్‌ ప్రావీణ్యతను, కార్యకలాపాలను ప్రముఖంగా వివరిస్తూ, అంతర్జాతీయంగా సాగే డిజిటల్‌ ‌లావాదేవీల్లో సగం భారత్‌‌లోనే సాగుతున్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న శక్తి సామర్ద్యాలను పుణికిపుచ్చుకుని భారత్‌ ‌చాలా వేగంగా పరివర్తన చెందుతోందని చెప్పారు. భారత్‌, యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, ఉభయ పక్షాలు కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందం వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు విస్తరిస్తాయన్నారు.

పారదర్శకత, ప్రతిభ, అవకాశాల అద్భుతమైన కలయికే భారతదేశమని మోడీ వ్యాఖ్యనించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రతిభా నైపుణ్యాల కేంద్రమని అన్నారు. రోజు రోజుకూ వినూత్న ఆలోచనా ధోరణులకు, పెట్టుబడులకు భారత్‌ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఆవిర్భవిస్తోందన్నారు. ప్రభుత్వ నిబంధనలను సరళీకరిస్తూ, వ్యాపారాలు చేయడాన్ని మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. 5వేల కోట్ల డాలర్లకుపైగా విలువైన నిర్దిష్ట రాయితీలు ఇవ్వడం ద్వారా వినూత్న ఆవిష్కరణలకు, వాణిజ్యకరణకు భారత్‌ తోడ్పాటునందిస్తోందని చెప్పారు. పారిస్‌ ‌పర్యటనా సమయంలో మిస్ర్తల్‌ ఎఐ సిఇఓ, సహ వ్యవస్థాపకుడు అయిన ఆర్థర్‌ ‌మెన్స్క్‌‌తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. మ్రిస్తల్‌ ఎఐ అనేది పారిస్‌ ‌ప్రధాన కేంద్రంగా పనిచేసే యురోపియన్‌ ‌కృత్రిమ మేధో సంస్థ. అత్యాధునికమైన ఎఐ మౌలిక సదుపాయాలు, అధునాతన లార్జ్‌ ‌లాంగ్వేజ్‌ ‌మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎం)లో నైపుణ్యాలు కలిగిన సంస్థ. పారిస్‌‌లోని ప్రవాస భారతీయులతో కూడా ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇవియాన్‌లో జరిగిన జి-7 సదస్సు విజయవంతమైందని, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళపై ప్రపంచ నేతలు చర్చించారని, అనేక అంశాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారని మోడీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌‌లో పోస్టు పెట్టారు. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా పంచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -