నవతెలంగాణ – కుభీర్
కుభీర్ మండలం ఎపిఎం గా దత్తత్రి బుధువారం ఇంచార్జ్ ఎపిఎం గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎంత కాలం ఇక్కడ పని చేసిన ఎపిఎం వందేమాతరం కామారెడ్డి జిల్లా కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో కుభీర్ మండలంలో సౌంలీ సీసీ గా విధులు నిర్వహిస్తున్న దత్తత్రికి ఇంచార్జ్ ఎపిఎం గా నూతన బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా దత్తత్రి మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీ లో ఉన్న మహిళా సంఘాల అభివృద్ధికి బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు.
అదే విదంగా గ్రామంలో మహిళాలకు నూతన మహిళా సంఘ భవనాలు నిర్మించేందుకు ప్రతి ఒక్కరి కృషి తో మహిళా సంఘాల కు రుణాలు మంజూరు చేసి వారికి ఆర్థిక ఇబ్బందులు కల్గకుండా రుణాలు మంజూరు చేస్తామని అన్నారు. అనంతరం బాధ్యతలు తీసుకున్న వారికి శాలవా పూల మాలతో సన్మాంచారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు లక్ష్మి సీసీ భూమన్న, విఠల్ గంగాధర్ అములు మోహన్ సాయినాథ్ లు సిబ్బంది తదితరులు ఉన్నారు.



