కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మల్హర్, మహాదేవపూర్, మహముత్తరం, పలిమేల 5 మండలాల్లో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ లు, సిసి రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ది పనులకు గాను రూ.5 కోట్ల 60 లక్షల నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా గురువారం ఒక ప్రకటన తెలిపారు.
ప్రజా ప్రభుత్వంలో పల్లెల్లో రోడ్లు,డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులకు మండలానికి రూ.1 కోటి మంజూరు కాగా అడ్వాలపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, అన్సాన్ పల్లి గ్రామానికి రూ.5 లక్షలు, చిన్నతూండ్ల గ్రామానికి రూ.5 లక్షలు, ఎడ్లపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, ఇప్పలపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, కొండంపేట గ్రామానికి రూ.5 లక్షలు, కొయ్యూరు గ్రామానికి రూ.10 లక్షలు, మల్లంపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, మల్లారం గ్రామానికి రూ.5 లక్షలు, నాచారం గ్రామానికి రూ.5 లక్షలు, పెద్దతూండ్ల గ్రామానికి రూ.10 లక్షలు, గాదంపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, రుద్రారం గ్రామానికి రూ.15 లక్షలు, తాడిచెర్ల గ్రామానికి రూ.15 లక్షలు, వల్లెంకుంట గ్రామానికి రూ.5 లక్షలు మంజూరు చేశారని పేర్కొన్నారు.



