నవతెలంగాణ – జుక్కల్
హిందూ సమ్రాట్, స్వరాజ్య స్థాపకుడు, ధైర్యసాహసాల ప్రతీక అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి దేశ ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని శివాజీ మహారాజ్ యువజన సంఘం నాయకులు అన్నారు. ఈ సందర్భంగా యూత్ నాయకులు మాట్లాడుతూ మండలంలోని పెద్ద ఎడ్గి, పెద్ద గుల్ల , బిజ్జల్ వాడి , కత్తల్ వాడి , చండేగావ్ , మాదాపూర్, హంగర్గ , దోస్తు పల్లి, వజ్రఖండి, కంఠాలి, లొంగన్ , నాగల్ గావ్ , లాడేగావ్, మహమ్మదాబాద్, ఖండేబల్లూర్, సోపూర్ , చిన్న గుల్లా, డోన్ గావ్ , శక్తీనగర్, జిపి గ్రామాలలో గురువారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
శివాజీ మహారాజ్ పరాక్రమం, దూరదృష్టి, ప్రజల పట్ల ప్రేమ, స్వాభిమాన భావం మనందరికీ స్ఫూర్తి ప్రదాతలు అని వక్తలు అన్నారు. స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది అని తెలిపారు. ఈ పవిత్ర దినాన ఆయన చూపిన ధర్మ మార్గం, న్యాయం, నాయకత్వ లక్షణాలను మన జీవనంలో ఆచరిద్దాం అని సూచించారు. సమాజ సేవలో దేశాభివృద్ధిలో ముందుండేలా ప్రతిజ్ఞ చేద్దాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



