నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో హిందుస్థాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలు కొనియడారు. యువత శివాజీ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ యూత్ క్లబ్ అధ్యక్షులు తక్కల రాజేందర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, పంచాయతి కార్యదర్శి శ్యామ్, బీజేపీ జిల్లా కోశాధికారి రెడ్డిగారి రమేష్ రెడ్డి, తక్కల నర్సరెడ్డి, తక్కల బాపురెడ్డి, మద్ది సూర్యకాంత్ రెడ్డి, మద్ది కృష్ణరెడ్డి, నాగర్తి చంద్రారెడ్డి, సందు రవీందర్ రెడ్డి, నాగర్తి నరేందర్ రెడ్డి, పైల శ్రీనివాస్ రెడ్డి, తక్కల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



