Sunday, June 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగాజు ఛాంబర్ల స్లీపర్ బస్సుల తనిఖీ

గాజు ఛాంబర్ల స్లీపర్ బస్సుల తనిఖీ

- Advertisement -

రెండు రోజుల్లో 3 బస్సులు సీజ్
అరుణాచల్‌ సర్కారుకు రవాణా శాఖ నోటీసులు
ప్రయాణీకుల ప్రాణాలు, భద్రత కీలకమని స్పష్టీకరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించే విధంగా గాజు ఛాంబర్లు ఏర్పాటు చేసిన ప్రయివేటు స్లీపర్ బస్సులపై తెలంగాణ రవాణా శాఖ కఠిన చర్యలకు దిగింది. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా గత రెండు రోజుల్లో ఆ తరహాకు ,చెందిన మూడు బస్సులను సీజ్‌‌చేసింది. సీజ్ చేసిన వాహనాలన్నీ అరుణాచల్ప్రదేశ్‌ రాష్ట్రంలో రిజిస్ర్టేషన్‌ అయిన బస్సులుగా గుర్తించారు. దేశవ్యాప్తం గా జరిగిన పలు స్లీపర్ బస్సుల అగ్నిప్రమాదాల నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌‌హెచ్‌ఆర్‌‌సీ) ప్రయాణికుల భద్రతకు ఆటంకమయ్యే నిర్మాణాలు, మార్పులు, మూసివేసిన క్యాబిన్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సంఘటనలు, అగ్నిప్రమాదాల సమయంలో ప్రయాణి కులు వేగంగా బయటకు రావడానికి, రక్షణ సిబ్బంది లోపలికి చేరుకోవ డానికి అడ్డంకులు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. పూణేకు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (సీఐఆర్‌‌టీ) నిర్వహిం చిన అధ్యయనాల్లో స్లీపర్ కోచ్‌లలో గాజు ఛాంబర్లు ఉండకూడదు. అంతేగాక పూర్తిగా మూసివేసిన క్యాబిన్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల తరలింపుతోపాటు రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకంగా ఉంటాయి. స్లీపర్ బస్సుల నిర్మాణానికి సంబంధించిన ఏఐఎస్‌-119 ప్రమా ణాలు, ఏఐఎస్‌-052 ప్రకారం పలు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అత్యవసర నిష్క్రమణ మార్గాలు అందుబాటులో ఉంచడం, ప్రయాణికుల రాకపోకలకు తగిన గ్యాంగ్‌వే ఉండేలా చూసుకోవాలి. అలాగే రూఫ్ ఎస్కేప్ హాచ్‌లు, ఎమర్జెన్సీ విండోలు పనిచేసేలా తరచుగా చెక్‌ ‌చేసుకో వాలి. ప్రమాదం అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులు వేగంగా బయటకు వచ్చే విధంగా అంతర్గత నిర్మాణం ఉండాలని సూచించింది. అనుమతిం చిన డిజైన్‌కు విరుద్ధంగా ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకూడదు.
గాజు చాంబర్లతో నష్టం
గాజు ఛాంబర్లు ఏర్పాటు చేయడం మూలంగా బస్సుల నుంచి బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోతాయి. పొగ వ్యాప్తి పెరుగుతుంది. రక్షణ చర్యలకు విఘాతం కలుగుతుంది. రకరకాల ఆటంకాల మూలంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు, రవాణా శాఖ అధికారులు అభిప్రా యపడుతున్నారు. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా రెండు బస్సులు పట్టుబడ్డ నేపథ్యంలో అరుణాచల్‌ ప్రదేశ్ అధికా రులకు ‌తెలంగాణ ప్రబుత్వం నోటీసులు జారీచేసింది. సీజ్ చేసిన వాహనాలకు సంబంధించిన వివరాలను అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ అథారిటీలకు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసిన అధికారులకు, పర్మిట్ జారీ చేసిన అధికారులకు పంపిస్తూ నోటీసులు జారీ చేస్తామని రవాణా శాఖ ప్రకటించింది. సంబంధిత వాహనాలు ఆమోదించబడిన డిజైన్, ఏఐఎస్‌ ప్రమాణాలు, మోటారు వాహనాల చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయానే విషయాన్ని పరిశీలించి, అవసరమైతే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ,పర్మిట్ రద్దు చర్యలు తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు
రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. గాజు ఛాంబర్లు, అనధికారిక మార్పులు లేదా ప్రయాణికుల భద్రతకు హాని కలిగించే నిర్మాణాలు ఉన్న బస్సులపై మోటారు వాహనాల చట్టం, కేంద్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించి ట్రావెల్స్ బస్సులను నడిపితే వాటిని తక్షణమే సీజ్ చేస్తామని రవాణా శాఖ హెచ్చరించింది.
ప్రయాణికులకు విజ్ఞప్తి
గాజు ఛాంబర్లతో కూడిన స్లీపర్ బస్సులలో ప్రయాణించవద్దని ప్రయాణికులకు రవాణా శాఖ విజ్ఞప్తి చేస్తోంది. అటువంటి వాహనాలు కనిపించినట్టయితే, సమీప రవాణా శాఖ కార్యాలయానికి సమాచారం అందించవలసిందిగా కోరుతోంది. ప్రయాణికుల ప్రాణాలతోపాటు భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని అధికారులు చెబుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించే ప్రయివేటు ట్రావెల్‌ ‌బస్సులపై నిఘా పెడతామని ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -