కథానాయకుడు యశ్ నటించిన ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి మేకర్స్ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్‌ను నేటి (శుక్రవారం) ఉదయం 9:35 గంటలకు విడుదల చేస్తామని టీం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ చేసిన న్యూ పోస్టర్ అందరిలోనూ అంచనాల్ని పెంచేసింది. ఇందులో రాయ పాత్రలో యశ్ రక్తాన్ని ఏరులై పారించినట్టుగా కనిపిస్తోంది. మంచు ప్రాంతమైనా కూడా ఎర్రని రక్తంతో నిండిపోయింది. ఇక అలా రక్తపాతాన్ని సృష్టించిన అనంతరం యశ్ మత్తులో మునిగేందుకు మందు తాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి మరి కొంత కథను రివీల్ చేసేలా టీజర్‌ను కట్ చేశారు. కథ, కథనం ప్రభావం అన్ని భాషల్లో ఒకేలా ఉండేందుకు టీజర్‌ను ఒకే భాషలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాలో కియారా అద్వానీ నదియాగా, హుమా ఖురేషి ఎలిజబెత్‌గా, నయనతార గంగగా, తారా సుతారియా రెబెక్కాగా, రుక్మిణి వసంత్ మెల్లిసాగా అద్భుతమైన పాత్రల్లో కనిపించనున్నారు. చివరగా రాయ పాత్రలో యశ్‌ను చూపించిన తీరు, రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చింది. యశ్, గీతు మోహన్‌దాస్ సంయుక్తంగా రాసిన ఈ కథని గీతు మోహన్‌దాస్ తెరపైకి తీసుకు వచ్చారు. కన్నడ, ఇంగ్లీష్ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు. ఇక ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతోపాటు అనేక ఇతర భాషలలో డబ్ చేయనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మించిన ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.
అంచనాలు పెంచేలా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



