Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి రెండు గేదెలు మృత్యువాత

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి రెండు గేదెలు మృత్యువాత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి రెండు పాడి గెదలు మృత్యువాత చెందిన సంఘటన మండలం ఎడ్లపల్లి గ్రామపంచాయతీ పరిదిలోగల జంగిడిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గెదలు యజమాని పిట్టల శ్రీనివాస్ పూర్తి కథనం ప్రకారం రోజులాగే గెదలను ఆదివారం ఉదయం మేతకు వదిలిపెట్టినట్లుగా తెలిపారు. రుద్రారం-కొయ్యుర్ ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి రెండు పాడి గెదలు అక్కడికక్కడే మృత్యువాత చెందినట్లుగా తెలిపారు. ఒక్కొక్క గేదె రూ.40 వేలు ఉంటుందని, తనకు రూ.80 వేల నష్టం జరగడమే కాకుండా రోజు పాలు విక్రయించి రూ.400 ఆదాయం సైతం పోయిందని బాధిత రైతు కన్నీరున్నీరైయ్యాడు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -