Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి అభినందనీయం

విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి అభినందనీయం

- Advertisement -

నవతెలంగాణ హలియా 
మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ నాణ్యమైన విద్యను బోధిస్తూ గ్రామీణ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల పనితీరు అభినందనీయం అని హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి అన్నారు. పి ఆర్ టి యు టి ఎస్ అనుముల, పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మరియు నిడమానూరు మండలాల శాఖల ఆధ్వర్యంలో హాలియా పట్టణంలో నూతనంగా ఎన్నికైన హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి ని మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ ను ఆత్మీయంగా ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి ఉపాధ్యాయులు నుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికశాతం నిధులు కేటాయిస్తోందని, పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, అధిక పోషక విలువలు కలిగిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తోందని, ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులను నియమిస్తోందని, ఉపాధ్యాయుల అన్ని రకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని కనుక ఉపాధ్యాయులు తమ వంతుగా విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకిత భావంతో సృజనాత్మకత జోడించి విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లగొండ జిల్లా పి ఆర్ టి యు టి ఎస్ ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి హాజరైనారు. హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గుండా కృష్ణ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అనుముల మండల పి ఆర్ టి యు టి ఎస్ అధ్యక్షులు చెన్ను వెంకటరెడ్డి స్వాగతం పలకగా, ప్రధాన కార్యదర్శి మంచికంటి మధు వందన సమర్పణ చేశారు.

ఈ సన్మాన కార్యక్రమం లో పెద్దవూర ఎం ఇ ఓ తరి రాము, చల్మారెడ్డిగూడెం స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ ముడుసు ప్రకాశ్, ,వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇరుమాది పాపిరెడ్డి, నారాయణదాసు దుర్గా ప్రసాద్, మొక్క పరుశ్ రామ్ గౌడ్,కున్ రెడ్డి సైదిరెడ్డి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు బాణావత్ సక్రు నాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మందా సైదులు రావు గౌతమ్, నెమలి వెంకటరెడ్డి,దండ వీరారెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పెనుగొండ సుబ్బారావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పాంపాటి అరవింద్ కుమార్,మేదరి దేవేందర్,వడ్త్యా నోవా, మారం రవీందర్, కన్మంతరెడ్డి జైపాల్ రెడ్డి,మేగావత్ లోక్ నాథ్, కుందూరు జానారెడ్డి, కుంచం హరివర్థన్, వివిధ మండలాల రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -