కాటేపల్లి నరేందర్ కు పార్టీ న్యాయం చేస్తుంది
ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాటేపల్లి నరేందర్ రెడ్డి చేసిన సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు భూమా మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల జరిగిన మున్సిపల్ స్థానిక ఎన్నికల అభ్యర్థుల గెలుపు ఓటమిల విషయంపై చర్చించడం జరిగిందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాటేపల్లి నరేందర్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్ మేయర్ పదవి కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకోవడం ఆనందంగా ఉందని, రాబోయే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కూడా కైవసం చేసుకుంటుందని ఆయన ప్రభుత్వ సలహాదారుడికి భరోసా కలిగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన వారికి కచ్చితంగా పార్టీ బాధ్యతలు అప్పగించి న్యాయం చేస్తుందని కాటేపల్లి నరేందర్ రెడ్డికి హామీ ఇస్తున్నట్లు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, కాటేపల్లి రాహుల్ రెడ్డి తదితరులు ఉన్నారు.



