Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప సర్పంచ్ ల ఫోరం నూతన మండల కమిటీ ఎన్నిక 

ఉప సర్పంచ్ ల ఫోరం నూతన మండల కమిటీ ఎన్నిక 

- Advertisement -

ఉప సర్పంచ్ ల ఫోరం మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల ఉప్పలయ్య 
నవతెలంగాణ-నెల్లికుదురు 

ఉప సర్పంచ్ ల ఫోరం నెల్లికుదురు మండల నూతన కమిటీని ఏకాగ్రీవంగా ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ జిల్లా అధ్యక్షుడు కొయ్యల అనిల్ ఆదేశాల మేరకు ఎన్నుకున్నట్లు ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల ఉప్పలయ్య తెలిపారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాల ఉపసర్పంచ్ గా ఆత్మీయ సమావేశాన్ని ఉప సర్పంచ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు మంచాల వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం నూతన మండల కమిటీ అధ్యక్షునిగా మేచరాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్ ను, ఉపాధ్యక్షుడుగా సీతారాంపురం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ షేర్ నవీన్ రెడ్డిని, మునిగలవీడు గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ను మండల ప్రధాన కార్యదర్శిగా కొమ్మనబోయిన మల్లయ్య, వావిలాల గ్రామా ఉపసర్పంచ్ గుండెపాక ఎల్లమ్మను కోశాధికారి అధ్యక్షుడుగా రామన్నగూడెం ఉప సర్పంచ్ పర్నే వెంకన్నను, మండల గౌరవ సలహాదారు రతి రామ్ తండా ఉపసర్పంచ్ గుగులోతు సంతోష్ ను మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రావిరాల రామ ఉపసర్పంచ్ ఆరే తరుణ్ ను ఏకగ్రీవంగా ఎందుకు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యత మన బలం సాధనే మన లక్ష్యంగా ముందుకు సాగి ఉపసర్పంచ్ ల హక్కుల కోసం సమస్యలపై పోరాడుదాం అని ప్రజల అభివృద్ధి మన లక్ష్యంగా ముందుకు సాగుదాం అని అన్నారు. రాష్ట్ర జిల్లా మండల కమిటీ సహకరించిన ప్రతి ఒక్క గ్రామ ఉపసర్పంచ్ కి కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలక ఎల్లయ్య, రామగిరి సుమన్, రమేష్, బాలకృష్ణ, తో పాటు నాయకులు రమేష్ బాలకృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -