Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ కార్మికుల కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి

మున్సిపల్‌ కార్మికుల కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి

- Advertisement -

2వ పీఆర్సీ అమలు చేయాలి
కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, 2వ పీఆర్‌సీ అమలు చేయాలంటూ తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల ఎదుట కార్మికులు ధర్నాలు చేశారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌ తదితర మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, 2వ పీఆర్సీలో కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించి.. ఆయా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌ ఎదుట సిరిసిల్ల – వేములవాడ మున్సిపల్‌ కార్మికులు భారీ ధర్నా నిర్వహించి ఏవోకు వినతిపత్రం అందించారు. పెద్దపల్లి, కరీంనగర్‌ కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు.
కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.డీ సలీం మాట్లాడుతూ.. మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, రెండో పీఆర్సీ అమలు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.26వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికులందరికీ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికులు ధర్నా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -