Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకోర్టుకు వర్చువల్‌గా అల్లు అర్జున్

కోర్టుకు వర్చువల్‌గా అల్లు అర్జున్

- Advertisement -


సంధ్య థియేటర్‌ ‌తొక్కిసలాట కేసు
తదుపరి విచారణ జులై 6కు వాయిదా
నవతెలంగాణ-సుల్తాన్‌‌బజార్‌

హైదరాబాద్‌‌లోని ఆర్టీసీ క్రాస్‌‌రోడ్‌‌లో సంధ్య థియేటర్‌‌లో జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ సోమవారం నాంపల్లి కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. సినిమా షూటింగ్ నిమిత్తం ముంబయిలో ఉండటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని ఆయన తరఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. అందుకు కోర్టు అనుమతించింది. దాంతో ముంబయి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అల్లు అర్జున్ కోర్టు విచారణలో పాల్గొన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులు మాత్రం వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరయ్యారు. వాదనలు విన్న కోర్టు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కేసు తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది. ‘పుష్ప-2: ది రూల్’ సినిమా స్పెషల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు ఏ-11గా చేర్చిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -