నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు జిపి గ్రామాలలోఎస్ ఐ ఆర్. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆయా గ్రామాల సర్పంచ్ ల ఆధ్వర్యంలో ప్రక్రియ ప్రారంభించడం జరిగింది అని ఆయా గ్రామాల జిపి కార్యకర్తలు తెలిపారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలో ని గ్రామ సర్పంచ్ సావిత్రిబాయి సాయా గౌడ్, వి. రమణ సురేష్. పడంపల్లి సర్పంచ్ విజయ కుమారి, పెద్ద ఏడ్గి లో గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, నాగల్ గావ్ సర్పంచ్ జాదవ్ సునంద, డోన్గావ్ సర్పంచ్ కె . శ్రీనివాస్, మత్తురాతాండా సర్పంచ్ అనిత మోహన్, గుల్లతాండ సర్పంచ్ సుమతి రాథోడ్ యశ్పాల్ , కతల్ వాడి సర్పంచ్ గోపాల్ రావు, గుల్ల సర్పంచ్ మాధవరావు దేశాయ్, లొంగన్ సర్పంచ్ ఉషారాణి, దోస్పల్లి సర్పంచ్ మారుతి, ఆయా గ్రామాల జిపి కార్యదర్శిలు. బి ఎల్ ఓ. జిపి వార్డ్ మెంబర్స్. ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది . ఈ సందర్భంగా సర్పంచ్ లు మాట్లాడుతూ ఓటర్ జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ తమ పేర్లను నమోదు చేసుకోవాలని. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు ప్రతి ఒక్కరు సవరించుకోవాలని సూచించారు. ఎస్ ఐ ఆర్. ప్రక్రియ ప్రారంభంలో భాగంగా పోలింగ్ స్టేషన్ లలో పిఎస్. సర్వే ప్రారంభం చేయడం జరిగింది ఈ సర్వేలో ఓటర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ లో ఎస్ఐఆర్ ఓటరు ప్రక్రియ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



