డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను మూసివేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించికోవాలని డిమొక్రటివ్ టీచర్స్ పెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు.గురువారం నాల్గవ వార్షిక కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రకటించిన హామీలను నిలబెట్టుకోవాలని, అదేవిధంగా పాఠశాల విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తానని తమ మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు 8.2% బడ్జెట్ కేటాయించడం విడ్డూరంని ప్రకటించారు. నేప్-2 020లో భాగంగానే పాఠశాలలను మూసివేస్తానని, తెలంగాణ పబ్లిక్ స్కూల్లను ఏర్పాటు చేస్తామనడం విద్యారంగాన్ని ధ్వంసం చేయడమేనని ప్రకటించారు.ప్రస్తుతం ఉన్న పాఠశాలలనే బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల గా ఎన్నోసార్లు ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ వారు మాత్రం ప్రపంచ బ్యాంకు షరతులకు తలగి వారి షరతులను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకటయ్యారని పేర్కొన్నారు.ఇప్పటికైనా రాష్ట్రంలో జీవో నెంబర్ 25ని రద్దుచేసి రాష్ట్రంలోని సుమారు 27 వేల పాఠశాలలకు బదులు 4 వేల పాఠశాలలను చేస్తానని అన్న మాటను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టి ప్రైవేటు పాఠశాలల చర్యలను నియంత్రించాలన్నారు. మరో అతిధి డి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ టి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో రావలసిన పి.ఆర్.సి ఇప్పటికీ రాలేదని, ఆరు డి ఏ లు కూడా రావాల్సి ఉందని, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఇప్పటికీ దాని మూసేత్తడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం టి జి జేఏసీ కి ఇచ్చిన హామీలను అమలు చేయనట్లయితే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ కౌన్సిల్కు డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ అశోక్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ తిరుపతి కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షునిగా సిహెచ్ అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏ తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులుగా జి శ్రీనివాస్ రెడ్డి, కే సునీత, బి తిరుపతిరెడ్డి లు ఎన్నిక కాగా, కార్యదర్శిలుగా ఈ వీరేశం, ఏ . బొజ్జ నాయక్,, ఎస్ వీరన్న, సిహెచ్ ప్రభాకర్ లు ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్ గా టి సుదర్శనం, బి భాగ్యలక్ష్మి, పి రమణారెడ్డి, ఏ లక్ష్మణ్ నాయక్, బి ప్రభాకర్ రెడ్డి, జి రవీందర్ రెడ్డి, కే రవీందర్, ఎం వెంకటేశ్వర చారి, బి కుమారస్వామిలు ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్ గా ఎం మధు సభ్యులుగా కే రాజేశం టీ గోవర్ధన్లు ఎన్నికయ్యారు.



