Friday, June 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుజలవివాదాలు పరిష్కరించుకుందాం

జలవివాదాలు పరిష్కరించుకుందాం

- Advertisement -

తుంగభద్ర నీటి సమస్యకు శాశ్వత మార్గం
చంద్రబాబు, డీకేతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి భేటీ.. కేంద్ర మంత్రి పాటిల్ ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వినతి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తుంగభద్రకు సంబంధించిన అంతర్రాష్ట్ర జల వివాదానికి రాజకీయా లకతీతంగా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్ట్‌ కొత్త గేట్ల ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌, కర్నా టక సీఎం డీకే శివకుమార్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. ఇది 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం కాదు… మూడు తరాల సమస్యను పరిష్కరించే కార్యక్రమం. లక్షలాది మంది రైతుల సమస్యలను ఈ గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతోంది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాల సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారిస్తారని నమ్ముతున్నాను. రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్టీఎస్‌) కు కేటాయించిన 17.9 టీఎంసీల నీళ్లలో కేవలం 5 నుంచి 6 టీఎంసీలే తెలంగాణ రైతాంగం వాడుకుంటోంది. దాదాపు 10 టీఎంసీల నీళ్లు రావడం లేదు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడంతోపాటు కేటాయిం పుల సమస్యతో అనుకున్న నీరు రాష్ట్రానికి రావడం లేదు. కేంద్ర మంత్రి సమక్ష‍ంలో ముగ్గురు సీఎంల మధ్య జరిగిన సమావే శంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని నిర్ణయించాం. కచ్చితంగా ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ బడుతుంది. పంచాయితీ కావాలా? సమస్య పరిష్కారం కావాలా? అంటే నేను పరిష్కారమే కోరుకుంటా. రాజకీయా లకతీతంగా తుంగభద్ర నదీ ఒడ్డున జరిగిన చర్చలు గొప్ప నిర్ణయంగా మారబో తున్నాయి’ అని సీఎం పేర్కొన్నారు.

ఈ భేటీతో ఏపీ, తెలంగాణ, కర్నా టకలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. తుంగభద్ర సమస్యకు దశాబ్దాలుగా పరిష్కారం దొరక్క పోవడంతో నీళ్లు సముద్రం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత సమావేశం అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి మొదటి అడుగు పడిందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారమైతే తెలంగాణలోని గద్వాల, అలంపూర్, పాలమూరు ప్రాంతంలో సాగు, తాగు నీటి కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మైసూరు రాజులే రైతుల కోసం యుద్ధాన్ని వీడి పరిష్కారం కోసం ముందుకొచ్చారని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.. కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ, కర్నా టక రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, బసవరాజు హోరట్టి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -